/rtv/media/media_files/2025/09/02/ashu-reddy-2025-09-02-15-47-22.jpg)
ashu reddy
Pawan Kalyan Tatoo: బుల్లితెర నటి ఆశు రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచింది. నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పెట్టిన పోస్ట్ దుమారం రేపుతోంది. ఆశు తన చాతిపై పవన్ పేరును టాటూ వేయించుకొని.. ఆ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెష్ తెలిపింది. మీరు ఉన్న ఈ భూమి పైనే నేను కూడా పుట్టినందుకు గర్విస్తున్నాను! ప్రజల దేవుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ జత చేసింది. ఈ ఫొటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె అభిమానానికి వావ్, సూపర్ అంటుంటాగా.. మరికొందరు ఎక్కడ ప్లేస్ లేనట్లు అక్కడ వేయించుకున్నావేంటి అంటూ తిట్టిపోస్తున్నారు. ఏదైమైనా ఈ బోల్డ్ బ్యూటీ మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
గతంలో డైరెక్టర్ ఆర్జీవి ఇంటర్వ్యూతో వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ. ఇంటర్వూలో ఆర్జీవి అషు పాదాలను తాకుతూ ముద్దు పెట్టుకోవడం పెద్ద సెన్షేషన్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆశు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారడంతో పాటు తీవ్ర విమర్శల పాలైంది కూడా. ఇప్పుడు పవన్ టాటూతో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.
జూనియర్ సమంతగా పాపులర్
జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో సెన్షేషన్ క్రియేట్ చేసిన ఆశు .. అదే పాపులారిటీతో బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. కానీ, ఒక నాలుగు వారాలకే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఓటీటీ సీజన్ కి కూడా వెళ్లింది. కానీ ఇక్కడ కూడా ఫైనల్స్ వరకు వెళ్లలేకపోయింది. బిగ్ బాస్ తర్వాత పలు టీవీ షోలు, ఈవెంట్స్ లో సందడి చేస్తోంది. అప్పడప్పుడు యాంకర్ కూడా అలరిస్తోంది. పలు సినిమాల్లోనూ మెరిసింది ఆశు. చల్ మోహన్ రంగా, బాయ్ ఫ్రెండ్స్ ఫర్ హైర్, యేవమ్, మాస్టర్ పీస్ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. సినిమాలు, షోలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తరచూ హాట్ ఫొటో షూట్స్ షేర్ చేస్తూ కుర్రకారు మతిపోగొడుతుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ ముద్దుగుమ్మకు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
అయితే కేరీర్ ప్రారంభంలో డబ్స్ మ్యాష్ వీడియోలు, రీల్స్ ద్వారా బాగా పాపులారైంది ఆశు. ఈ వీడియోల్లో అచ్చం సమంతలాగే కనిపించడంతో .. జూనియర్ సమంత బిరుదు ఇచ్చారు నెటిజన్లు. ఇదిలా ఉంటే.. ఇటీవలే ఆశుకి బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని ఆశు స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం ఆశు అనారోగ్యం నుంచి కోలుకొని మళ్ళీ టీవీ షోలు, ఈవెంట్స్ లో సందడి చేస్తోంది.