Shivaji Comments: సామాన్లు కనపడేలా బట్టలు అవసరమా..? న‌టుడు శివాజీ షాకింగ్ కామెంట్స్!

'దండోరా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. సంప్రదాయ దుస్తుల్లోనే నిజమైన అందం, గౌరవం ఉంటాయని ఆయన అన్నారు. గ్లామర్ హద్దుల్లో ఉండాలన్న మాటలపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

New Update
Shivaji Comments

Shivaji Comments

Shivaji Comments: ఇటీవల బిగ్‌బాస్ షోతో మళ్లీ మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు శివాజీ, ఆ తర్వాత 'కోర్ట్' సినిమాలో నెగటివ్ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆయన ముఖ్య పాత్రలో నటించిన తాజా సినిమా 'దండోరా' ఈ నెల 25న విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి జరిగింది. ఆ వేడుకలో శివాజీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా హీరోయిన్లు ఎలా డ్రెస్సింగ్ చేయాలి అన్న అంశంపై ఆయన మాట్లాడిన తీరు వివాదంగా మారింది.

మొదటగా ఈవెంట్‌కు చీరలో వచ్చిన యాంకర్ ప్రశాంతిని శివాజీ ప్రశంసించారు. చీరలో ఆమె చాలా గౌరవంగా, అందంగా కనిపించిందని చెప్పారు. ఆ తర్వాత సాధారణంగా హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతూ, అందం అంటే శరీరాన్ని చూపించడం కాదని, గౌరవంగా,  సింపుల్‌గా ఉండడమే నిజమైన అందమని అన్నారు. సంప్రదాయ దుస్తులు, కాస్త కవర్ అయ్యే డ్రెస్సులు మహిళలకు మరింత ఆకర్షణ ఇస్తాయని ఆయన అభిప్రాయం తెలిపారు.

Actor Shivaji Controversial Comments

కొన్నిసార్లు హీరోయిన్స్ సామాన్లు కనిపించేలా వేసుకుంటున్నారు ఆలా చేస్తే చూసి నవ్వుతారు పైకి నవ్వినా లోపల మాత్రం అందరూ తిట్టుకుంటారు. గ్లామర్ పేరుతో హద్దులు దాటి దుస్తులు వేసుకుంటున్నారంటూ కామెంట్స్ చేశారు శివాజీ. ఈ మాటలను మహిళల స్వేచ్ఛకు వ్యతిరేకంగా అర్థం చేసుకోవద్దని కూడా స్పష్టం చేశారు.

మహిళ అంటే ప్రకృతికి ప్రతీక అని, గౌరవంగా ఉండటం వల్ల ఆమెకు మరింత విలువ పెరుగుతుందని చెప్పారు. తన తల్లి తన మనసులో ఇప్పటికీ ఒక బలమైన, గౌరవమైన రూపంగా నిలిచిపోయిందని గుర్తు చేశారు. ఇప్పటి తరం మహిళల్లో కూడా చాలా మంది హుందాగా, అందంగా కనిపిస్తున్నారని అన్నారు. గ్లామర్‌తో పాటు గౌరవాన్ని నిలబెట్టుకున్న నటీమణులను ఉదాహరణగా చెప్పారు.

గ్లామర్ తప్పు కాదని, కానీ అది ఒక స్థాయిలో ఉండాలని శివాజీ అన్నారు. అంతర్జాతీయ వేదికలపై కూడా చీరలు ధరించిన మహిళలు పెద్ద బ్యూటీ టైటిల్స్ గెలిచారని గుర్తు చేశారు.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నటీమణులు ఎలా దుస్తులు వేసుకోవాలో చెప్పే హక్కు ఆయనకు లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై ఆన్‌లైన్‌లో చర్చ ఇంకా కొనసాగుతోంది.

Advertisment
తాజా కథనాలు