Shambhala Release: 'శంభాలా' విడుదలకు ముహూర్తం ఫిక్స్ ! ఈసారి హిట్టేనా!

హీరో ఆది సాయి కుమార్ చాలా కాలం గ్యాప్ తర్వాత  'శంభాలా' అనే మిస్టరీ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, టీజర్ మంచి హైప్ క్రియేట్ చేశాయి.

New Update
Shambhala

Shambhala

Shambhala Release: హీరో ఆది సాయి కుమార్ చాలా కాలం గ్యాప్ తర్వాత  'శంభాలా' అనే మిస్టరీ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, టీజర్ మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఆది కెరీర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రమిది.  ఉగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజశేఖర్ అన్నభీమోజు,  మహిధర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఎక్కడా కూడా రాజీపడకుండా అద్భుతమైన నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

క్రిస్మస్ కానుకగా.. 

తాజాగా మూవీ నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఎట్టకేలకు మూవీ విడుదల తేదీని ప్రకటించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ లో ఆది చాలా సీరియస్ గా, పవర్ ఫుల్ లుక్ ఓ కనిపించారు. అంతేకాదు ఆది పక్కన కుక్క, బ్యాక్ గ్రౌండ్ లో పొగ అస్థిపంజరం ఆకారంలో కనిపించడం మిస్టికల్ అండ్ భయంకరమైన అనుభూతిని ఇస్తోంది. గత కొన్నేళ్లుగా ఆది కెరీర్ లో సరైన హిట్టు ఒక్కటి కూడా పడలేదు. దీంతో 'శంభాలా' విజయం ఆది కెరీర్ కి కీలకంగా మారనుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. 

మిస్టరీ థ్రిల్లర్ గా

హారర్, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్ అంశాల కలయికగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది జియో-సైంటిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. శంభాలా అనే గ్రామంలో జరిగే సన్నివేశాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ప్రశాంతంగా ఉన్న గ్రామంలోకి ఒక వింత శక్తి అడుగుపెట్టడంతో ఈ కథ మొదలవుతుంది. అప్పుడు ఆ వింత శక్తి నుంచి ప్రజలను కాపాడడానికి ఆది వస్తాడు. అసలు ఆ గ్రామాన్ని పీడిస్తున్న శక్తి ఏంటి? ఆది ఆ గ్రామాన్ని ఎలా కాపాడాడు?  అనేది సినిమా కథగా ఉండబోతుంది. ఈ సినిమాతో ఆది మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.  అర్చన అయ్యర్, స్వాసిక, రవి వర్మ, మధునందన్, శివకార్తిక్, శైలజ ప్రియ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Also Read: Hero Vishal: బాడీ అంతా 199 కుట్లు... హీరో విశాల్ చెప్పిన మాటలు వింటే షాకవుతారు!

Advertisment
తాజా కథనాలు