Shambhala: ఈసారి హిట్టు పక్కా.. ఆసక్తిరేపుతున్న 'శంబాల' ట్రైలర్!

హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'శంబాల: ఏ మిస్టిక్ వరల్డ్' ట్రైలర్ విడుదలైంది. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్, హారర అంశాలతో ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగింది.

New Update

Shambhala: హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'శంబాల: ఏ మిస్టిక్ వరల్డ్' ట్రైలర్ విడుదలైంది. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్, హారర అంశాలతో ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగింది. కొన్నివేల సంవత్సరాల క్రితం పరమశివుడికి- అసురుడికి మధ్య జరిగిన బీకర యుద్ధం ఈ కథకు మూలం అంటూ సాయి కుమార్ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది. అయితే కొన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం శివుడు,  అసురుడి మధ్య జరిగిన యుద్ధం నుంచి పుట్టిన ఒక శక్తివంతమైన రాయి ఒక గ్రామంలో పడుతుంది. ఆ రాయి పడినప్పటి నుంచి ఆ ఊరిలో వింత సంఘటనలు,  మరణాలు జరుగుతుంటాయి. అప్పుడు ఈ వింత సంఘటనల వెనుక ఉన్న రహస్యాన్ని కనుగొని, ఆ ఊరిని కాపాడేందుకు హీరో ఆది వస్తాడు. ఇందులో ఆది సాయికుమార్ భౌగోళిక శాస్త్రవేత్త పాత్రలో నటించారు. అసలు ఆ రాయి వెనుక ఉన్న రహస్యమేంటి? ఆ అతీత శక్తి ఆది గ్రామాన్ని ఎలా కాపాడాడు అనేది సినిమా కథగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సైన్స్‌కి, అతీంద్రియ శక్తులకి మధ్య జరిగే పోరాటం వంటి అంశాలతో ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్స్ లో విడుదల కానుంది. 

Also Read: Allu Sirish Engagement: అబ్బా.. రామ్ చరణ్- బన్నీ ఏమున్నారు .. శిరీష్ ఎంగేజ్మెంట్ వేడుకలో మెగా- అల్లు ఫ్యామిలీ సందడి!

Advertisment
తాజా కథనాలు