/rtv/media/media_files/2025/08/02/71st-national-film-awards-2025-08-02-11-01-14.jpg)
71st National Film Awards
71వ నేషనల్ ఫిల్మ్ జ్యూరీ అవార్డుల వేడుక నిన్న అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో తెలుగు సినిమాలకు పలు విభాగాల్లో అవార్డుల పంట పండింది. మొత్తం 7 పురస్కారాలు తెలుగు చిత్రాలను వరించాయి. అందులో ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ నిలిచింది.
national film awards 2025 winners list
ఉత్తమ బాల నటిగా దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి జ్యూరీ అవార్డును అందుకున్నారు. ఆమె ‘గాంధీ తాత చెట్టు’ అనే చిత్రంలో తన నటనకు గానూ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అదే సమయంలో ఉత్తమ నేపథ్య గాయకుడిగా పీవీఎస్ఎన్ రోహిత్ నిలిచారు. ఆయన ‘బేబీ’ సినిమాలో ‘ప్రేమిస్తున్నా’ సాంగ్‌కు గానూ ఈ అవార్డును అందుకున్నారు.
అలాగే ఉత్తమ స్క్రీన్‌ప్లేకు గానూ సాయి రాజేష్ నీలం జ్యూరీ అవార్డును దక్కించుకున్నారు. ఆయన ‘బేబీ’ సినిమాకి అద్భుతమైన స్క్రీన్‌ప్లే అందించినందుకుగానూ ఈ అవార్డు వరించింది. అంతేకాకుండా బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ)గా నందు పృథ్వీ అవార్డును అందుకున్నారు. ఆయన ‘హను-మాన్’ చిత్రంలో స్టంట్‌లను అద్భుతంగా రూపొందించినందుకు గానూ ఈ అవార్డు తీసుకున్నారు.
గర్జించిన టాలీవుడ్
— oneindiatelugu (@oneindiatelugu) August 1, 2025
ఏకంగా 7 జాతీయ అవార్డులు#NandamuriBalakrishna#BhagavanthKesari#Balagam#HanuMan#NationalAward#71stNationalFilmAwards#ReelTalk#Oneindia#OITelugupic.twitter.com/adu4YOHud6
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ‘హను-మాన్’ చిత్రానికి జ్యూరీ అవార్డు లభించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ ‘హను-మాన్’ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్‌కు ఈ అవార్డు లభించింది. అలాగే ఈ 71వ నేషనల్ ఫిల్మ్ జ్యూరీ అవార్డ్స్‌లో తెలంగాణ సినిమాకు అరుదైన గౌరవం లభించింది.
దర్శకుడు వేణు యెల్దండి, నిర్మాత దిల్‌రాజు కాంబోలో వచ్చిన ‘బలగం’ సినిమా ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఈ సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ సాంగ్‌కు ఉత్తమ లిరిసిస్ట్ అవార్డును కాసర్ల శ్యామ్ దక్కించుకున్నారు. ‘బలగం’ సినిమాలో ఎంతో భావోద్వేగంతో కూడిన ఈ సాంగ్‌కు కాసర్ల శ్యామ్ ఉత్తమ గేయ రచయితగా అవార్డును అందుకున్నారు.
నేషనల్ అవార్డు కొల్లగొట్టిన తెలంగాణ సినిమా ‘బలగం’
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 1, 2025
బెస్ట్ లిరిక్స్ కేటగిరీలో.. ‘ఊరు పల్లెటూరు’ పాటకి గాను గేయ రచయిత కాసర్ల శ్యామ్‌కు జాతీయ పురస్కారం#NationalAwards#Balagam#ComedianVenky#KasarlaShyam#BalagamMoviepic.twitter.com/ZEFuWHd4Ph
ఈ సినిమా తెలంగాణ గ్రామీణ ప్రజల జీవితాన్ని, కుటుంబ బంధాల ప్రాముఖ్యతను, మానవ సంబంధాలను నేచురల్‌గా చూపించి సినీ ప్రియుల మనస్సు దోచుకుంది. ఇందులోని సాంగ్స్.. మరీ ముఖ్యంగా ‘ఊరు పల్లెటూరు’ పాట.. సినిమాలోని కథాంశాన్ని మరింత బలంగా చూపించింది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ సాంగ్‌లో ప్రతి పదం పల్లెటూరి జ్ఞాపకాలను గుర్తు చేసింది.
థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ పాట కేవలం ఒక పాటగా మాత్రమే కాకుండా.. తెలంగాణ సంస్కృతి, జీవన విధానానికి ప్రతిబింబంగా నిలిచింది. కాసర్ల శ్యామ్ ఈ అవార్డును అందుకోవడం తెలుగు సినీ పరిశ్రమకు.. మరీ ముఖ్యంగా తెలంగాణ సినిమాకు గర్వకారణం అని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.