2022 ఫిబ్రవరి చివరి వారంలో రిలీజైన మూవీ కశ్మీర్ ఫైల్స్. ఈ చిత్రం ఏకంగా రూ. 350 కోట్ల రూపాయలు కొల్లగొట్టి బాలీవుడ్‌లో రికార్డులు నెలకొల్పింది. దక్షిణాదిన పెద్దగా ఆడలేదు.. ఉత్తరాదిన మాత్రం దాదాపు నెల రోజుల పాటు చాలా చోట్ల నడిచింది. ప్రాపగాండ సినిమా అని, కశ్మీరీ పండిట్ల ఊచకోత గురించి ఒక వైపే చెప్పారని ఎన్ని కామెంట్లు వచ్చినా.. జనాలు మాత్రం ఎగబడి మరీ ఈ సినిమాను చూశారు. కరోనా టైమ్‌లో జరిగిన పరిస్ధితులు, ఇండియా తీసుకున్న చర్యలు, దేశంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇది కూడా ప్రాపగాండ సినిమా అని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా పేరు గత 24గంటలుగా ట్విట్టర్‌లో తెగ ట్రెండ్ అవుతుంది. ఎందుకా అని చూస్తే.. ఈ సినిమా రిలీజ్ డేట్ అని తెలుస్తుంది. అందులో ఏముంది అనుకుంటున్నారా? అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది.
తన ప్లాన్ చేంజ్ చేసుకున్న డైరెక్టర్
అగ్నిహోత్రి ఈ సినిమాను ముందుగా వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ సడెన్‌గా తన ప్లాన్ చేంజ్ చేసుకుని సెప్టెంబర్ 28నే రిలీజ్ చేయాలని మొండి పట్టున కూర్చున్నాడట. ఇక అదే రోజున సలార్ కూడా రిలీజవుతుంది.పెద్ద పెద్ద సినిమాలే సలార్ దరిదాపుల్లో రావడానికి భయపడుతుంటే.. ది వాక్సిన్ వార్ ఏకంగా ఈ సినిమాకే పోటీగా వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అదే రోజున ది వాక్సిన్ వార్‌ను తీసుకురావడానికి కూడా ఓ కారణం ఉందట. గతేడాది రాధేశ్యామ్ రిలీజ్ రోజునే ది కశ్మీర్ ఫైల్స్ సినిమా కూడా రిలీజయింది. ఈ సినిమా రాధేశ్యామ్‌కు గట్టి పోటీనిచ్చి.. దాని థియేటర్‌లను లాక్కుంది.
కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్‌పై నెటిజన్లు ఫైర్
ఇక ఇప్పుడు కూడా అదే విధంగా సలార్‌ను ఢీ కొడితే రిజల్ట్ రిపీట్ అవుతుందనే ఆశతో ఉన్నాడట మనోడు. దీనిపై పలువురు ఇదొక చెత్త నమ్మకం అని.. అప్పుడేదో ‘ది కశ్మీర్ ఫైల్స్’కు కలిసొచ్చిందని.. ఇప్పుడు అంత సీన్ లేదని, పంతాలకు పోయి సలార్‌కు పోటీగా రిలీజ్ చేస్తే నీకు కొత్త కష్టాలతో పాటు నష్టాలు కూడా తప్పవని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సలార్ టీజర్‌పై వివేక్ అగ్నిహోత్రి నెగిటివ్ క్రిటిసిజం చేస్తూ హీరోయిజం సినిమాలను జనం ఆదరించడం పట్ల ఘాటుగా కామెంట్లు చేశాడు. దీనిపై కూడా పలువురు నెటిజన్లు స్ట్రాంగ్‌గానే కౌంటర్లు ఇచ్చారు. మరీ నిజంగానే సలార్‌తో ది వాక్సిన్ వార్ క్లాష్ అవుతుందో లేదో చూడాలంటే రిలీజ్ డేట్ వరకు వెయిట్ చేయకతప్పదు.