/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/natti-kumar-jpg.webp)
చంద్రబాబు అరెస్ట్ తర్వాత టాలీవుడ్ పెద్దలపై సినీ నిర్మాత నట్టి కుమార్ వ్యాఖ్యల కలకలం రేపుతున్నాయి. చిత్ర పరిశ్రమలో ఎవరూ మాట్లాడటం లేదని నట్టి కుమార్ ప్రశ్నించారు. ఎవరికి భయపడి మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. జూనియర్ ఎన్టీఆర్ ఏమైపోయారంటూ ప్రశ్నించారు నట్టి కుమార్. చిరంజీవి, ప్రభాస్, వైవీఎస్ చౌదరి, అశ్వినీదత్, అరవింద్, సురేశ్‌బాబు, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్ ఎటు పోయారని అడిగారు నట్టికుమార్. దర్శకుడు రాఘవేంద్రరావు మాత్రమే స్పందించారని.. చంద్రబాబు వల్ల చాలా మంది లబ్ధిపొందారన్నారు. పదవి వచ్చినప్పుడు వెళ్లి బొకేలు ఇవ్వడం కాదని.. కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలవాలంటూ టాలీవుడ్ పెద్దలకు చురకలంటించారు నట్టికుమార్.
జగన్ ఉరితీస్తాడా?
ప్రతీ సందర్భంలో సినీ పరిశ్రమ కోసం ముందుండే వ్యక్తిగా చంద్రబాబు పేరు సంపాదించుకున్నారని నట్టికుమార్ కొనియాడారు. ఓ వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడుగా అండగా ఉండటం మానవత్వమని.. చంద్రబాబుకు మద్దతుగా నిలబడితే వైఎస్ జగన్ ఉరితీస్తాడా అని హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు చేసిన సేవలను గౌరవించి ఆయనకు అండగా నిలబడాలని.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో నందమూరి అభిమానులు ఏమైపోయారని.. ఎందుకు స్పందించడం లేదని నట్టి కుమార్ ప్రశ్నించారు. అటు పవన కల్యాణ్‌పై నట్టికుమార్ ప్రశంసలు కురిపించారు. వెనకాల నుంచి సపోర్ట్ చేసేవాళ్లు దొంగలని.. ముందుండి మద్దతు ఇచ్చిన అసలైన హీరో పవన్ అంటూ జనసేన అధినేతని పొడిగారు నట్టికుమార్. పెద్ద కొడుకుగా పవన్ ముందడుగు వేసి మద్దతు ఇచ్చారని.. సినీ పరిశ్రమ పెద్దలు దొంగ ముసుగులు వేసుకోవద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ప్రజలకు ప్రమాదమని.. చంద్రబాబు భోళా శంకరుడన్నారు. ఆయన ఏ రోజు కక్షసాధింపు పనులు చేయలేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని కక్షపూరితంగా ఏనాడూ చూడలేదని ఆరోపించారు నట్టికుమార్.
టార్గెట్ జూనియర్ ఎన్టీఆర్:
చాలా కాలంగా టీడీపీ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ జూనియన్ ఎన్టీఆర్ వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నారు. టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ సపోర్టు ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయినా తారక్ స్పందించలేదని వాపోతున్నారు. ఇటివలి కాలంలో ఎన్టీఆర్ శతజయంది వేడుకులకు కూడా జూనియర్ హాజరు కాలేదు. గత ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్‌లో టాలీవుడ్ లెజెండరీ యాక్టర్, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్‌టి రామారావు స్మారక చిహ్నం రూ.100 నాణేన్ని ఆవిష్కరించే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ డుమ్మా కొట్టారు. జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు, నటుడు కళ్యాణ్ రామ్ కూడా హాజరు కాలేదు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని సంవత్సరంలో జరిగిన ముఖ్యమైన కార్యక్రమానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ALSO READ: ఎక్కడ ఉన్నా ఆయన ప్రజల కోసమే ఆలోచిస్తారు: నారా భువనేశ్వరి!