Smoking: భోజనం తర్వాత సిగరేట్‌ తాగుతున్నారా? ఇది తెలుసుకుంటే వెంటనే ఆపేస్తారు!

భోజనం తర్వాత సిగరేట్‌ తాగే అలవాటు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. స్పెర్మ్‌ క్వాలిటీ తగ్గడం, దంత సమస్యలు, క్యాన్సర్, శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతినడం లాంటి అనేక ఆరోగ్య సమస్యలు తప్పవని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Smoking: భోజనం తర్వాత సిగరేట్‌ తాగుతున్నారా? ఇది తెలుసుకుంటే వెంటనే ఆపేస్తారు!
New Update

సిగరేట్లు(cigarettes) అమ్మే షాపుల వద్ద మధ్యాహ్నం ఎక్కువ మంది కనిపిస్తుంటారు. ముఖ్యంగా ఆఫీస్‌లకు దగ్గరున్న షాపుల్లో ఈ సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం ఆఫీస్‌లో అందరితో కలిసి భోజనం చేయడం ఆ తర్వాత సిగరేట్‌ తాగడం చాలా మందికి ఉండే అలవాటు. ఐటీ కంపెనీ ఉద్యోగుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. అటు టౌన్స్‌, విలేజిల్లోనూ తిన్న తర్వాత తాగడం కొంతమంది అలవాటు. సిగరేట్ స్మోగింగ్‌ ఏ సమయంలో చేసినా అది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.. అయితే తిన్న వెంటనే తాగడం మరింత ప్రమాదకరం.

publive-image ప్రతీకాత్మక చిత్రం

అసలు ఎందుకిలా తాగుతారు?

తిన్న తర్వాత సిగరేట్‌ స్మోకింగ్‌ వెనుక కొన్ని కారణాలున్నాయి. ఇది ఒక హ్యాబిట్‌. భోజనం ముగియగానే సిగరేట్‌ తాగలాని ఎక్కడో రాసి ఉన్నట్లు చాలా మంది దీన్ని ఒక హ్యాబిట్‌గా మార్చుకున్నారు. ఒకరిని చూసి మరొకరు ఇలా అలవాటు పడ్డారు. ఇక కొలిగ్స్‌ లేదా ఫ్రెండ్స్‌తో ఇలా సిగరేట్‌ తాగుతూ మాట్లాడడం వల్ల హ్యాపీనెస్‌ ఉంటుందన్నది కొంతమంది ఫీలింగ్‌. సిగరెట్‌లోని నికోటిన్ ఒత్తిడితో పాటు ఆందోళనను తాత్కాలికంగా తగ్గిస్తుంది. ఇటు బ్రెయిన్‌లో డోపమైన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఒక హ్యాపీ హార్మోన్‌. అందుకే తిన్న వెంటనే చాలా మంది ఇలా సిగరేట్‌ స్మోకింగ్‌కు అలవాటు పడ్డారు. ఇలా డొపమైన్ రిలీజ్‌ అవుతుంది కదా అని ఇదే కొనసాగిస్తే చివరకు జీవితంలో డొపమైన్‌ కాకుండా ఏడుపు తెప్పించే హర్మోన్లే మిగులుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కాసేపు ఆనందం కోసం లైఫ్‌ను రిస్క్‌ చేయవద్దని సూచిస్తున్నారు.

భోజనం తర్వాత సిగరేట్ తాగితే ఏం అవుతుందో తెలుసుకోండి.

క్యాన్సర్: ఊపిరితిత్తులు, నోరు, గొంతు, అన్నవాహిక, ప్యాంక్రియాస్, మూత్రాశయం, మూత్రపిండాలు, గర్భాశయంతో సహా వివిధ క్యాన్సర్‌లకు సిగరేట్‌ స్మోకింగ్‌ ప్రధాన కారణం. పొగాకులోని హానికరమైన రసాయనాలు డీఎన్‌ఏ(DNA)ని దెబ్బతీస్తాయి.

గుండె సంబంధిత వ్యాధులు: సిగరేట్ తాడం గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని కూడా పెంచుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

శ్వాసకోశ సమస్యలు: పొగతాగడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్ (COPD)కి కారణమవుతుంది. సిగరెట్‌ మన రోగనిరోధక వ్యవస్థను కూడా బలహీనపరుస్తుంది. దీని వల్లశ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు గురయ్యే ఎక్కువ అవకాశం ఉంది.

దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు: సిగరేట్‌ స్మోకింగ్‌ మధుమేహం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది.

దంత సమస్యలు: సిగరేట్‌ తాగడం వల్ల దంతాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఇది చిగుళ్ల సమస్యలకు కూడా దారి తీస్తుంది. నోటి క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి.

సంతానోత్పత్తి: సిగరేట్‌ తాగడం వల్ల సంతానోత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది పిల్లలను కనే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా అబ్బాయిల్లో ఇది స్పెర్మ్ క్వాలిటీని తగ్గిస్తుంది.

గర్భధారణ సమయంలో సమస్యలు: సిగరేట్‌ ఎక్కువగా తాగే గర్భిణీలకు పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం లాంటివి ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ అలవాటు అభివృద్ధి చెందుతున్న పిండానికి కూడా హాని కలిగిస్తుంది.

ఇక పైన చెప్పినవే కాదు.. సిగరేట్‌ తాగడం వల్ల ఇంకా చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఇవి మనల్నే కాదు మన చుట్టూ ఉన్నవారికి కూడా హాని చేస్తాయి.

Also Read: ఉదయాన్నే సిగరేట్ తాగే అలవాటు ఉందా? అయితే ఈ రోగాలు గ్యారెంటీ..!!

Watch This:

#cigarette #life-style
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe