లంచ్ తర్వాత ప్రారంభమైన చంద్రబాబు విచారణ.. ఈ 3 గంటలే అత్యంత కీలకం.. సీఐడీ వ్యూహం ఇదే? లంచ్ బ్రేక్ తర్వాత చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. By Nikhil 24 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి స్కిల్ డవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడి రెండో రోజు సీఐడీ విచారణ లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు చంద్రబాబుకు లంచ్ బ్రేక్ ఇచ్చారు అధికారులు. లంచ్ బ్రేక్ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన విచారణ సాయత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. దీంతో మిగిలిన ఈ 3 గంటల సమయం సీఐడీ అధికారులకు అత్యంత కీలక కానుంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత మేర చంద్రబాబు నుంచి కీలక వివరాలను రాబట్టాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశ్నల జాబితాను కూడా సీఐడీ మార్చినట్లు తెలుస్తోంది. ఉదయం అడిన ప్రశ్నలు, చంద్రబాబు చెప్పిన సమాధానాలు, ఇంకా రావాల్సి ఉన్న సమాచారం ఆధారంగా కొత్త ప్రశ్నల జాబితాను అధికారులు రూపొందించినట్లు సమాచారం. ఈ మిగిలిన 3 గంటల సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకుని సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని చంద్రబాబు నుంచి రాబట్టాలన్నది సీఐడీ అధికారుల వ్యూహంగా తెలుస్తోంది. విచారణ అనంతరం సాయంత్రం 5 గంటలకు చంద్రబాబును వర్చువల్ విధానంలో జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. విచారణ ముగిసిన తర్వాత చంద్రబాబుకు మరో సారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు నుంచి ఇప్పటి వరకు వచ్చిన సమాధానాలకు సీఐడీ అధికారులు ఏమాత్రం సంతృప్తి చెందనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించాలని కోర్టును కోరాలని సీఐడీ అధికారులు నిర్ణయిచినట్లు సమాచారం. దీంతో కస్టడి పిటిషన్ ను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు చంద్రబాబు కస్టడి సైతం ఈ రోజుతో ముగియనుంది. ఢిల్లీలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజమండ్రిలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. చంద్రబాబు కేసు విషయమై లాయర్లతో చర్చలు జరుపుతున్నారు. ఇది కూడా చదవండి: Chandrababu arrest : చంద్రబాబుకు సంఘీభావంగా ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి