Chandrababu Custody: నేడు చంద్రబాబును ప్రశ్నించనున్న సీఐడీ అధికారులు..

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబును సీఐడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం 9.30 గంటల నుంచి ఆయనను విచారించనున్నారు. చంద్రబాబును విచారించేందుకు విజయవాడ నుంచి రాజమండ్రికి బయలుదేరారు సీఐడీ అధికారులు. 12 మందితో కూడిన బృందం.. చంద్రబాబును విచారించనుంది.

New Update
Breaking : ప్రిన్సిపల్ సెక్రటరీకి డీఐజీ లేఖ..చంద్రబాబును కలవాలంటే ఆయన అనుమతి తప్పనిసరి..!!

CID Officials to Question Chandrababu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబును(Chandrababu) సీఐడీ అధికారులు(CID Officers) తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం 9.30 గంటల నుంచి ఆయనను విచారించనున్నారు. చంద్రబాబును విచారించేందుకు విజయవాడ నుంచి రాజమండ్రికి బయలుదేరారు సీఐడీ అధికారులు. 12 మందితో కూడిన బృందం.. చంద్రబాబును విచారించనుంది. ఈ బృందంలోని అధికారుల పేర్లను సీఐడీ తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టుకు సమర్పించారు. ఈ బృందంలో 9 మంది సీఐడీ అధికారులు, సిబ్బందితో పాటు ఒకక వీడియో గ్రాఫర్, ఇద్దరు మధ్యవర్తులు ఉన్నారు. వారి పేర్లతో కూడిన జాబితాను సీఐడీ తరపు న్యాయవాదులు నిన్న ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించారు. ఆర్థిక నేరాల విభాగం-2 డీఎస్పీలు ఎం. ధనుంజయుడు, వి.విజయ్ భాస్కర్, ఎ. లక్ష్మీనారాయణ, ఇన్స్‌పెక్టర్లు ఎన్.ఎల్.వి.మోహన్ కుమార్, వై. రవికుమార్, ఐ. శ్రీనివాసన్, సీహెచ్.సాంబశివరావు, ఏఎస్సై పి. రంగనాయకులు, కానిస్టే బుల్ ఎం.సత్యనారాయణ.. ఈ బృందంలో ఉంటారని సీఐడీ న్యాయవాదులు న్యాయస్థానానికి వివరించారు.

కోర్టు ఆదేశాల మేరకు ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబును విచారించనున్నారు సీఐడీ అధికారులు. కస్టడీ విచారణకు చంద్రబాబు తరఫున ఇద్దరు లాయర్లకు అనుమతి ఇవ్వడం జరిగింది. రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబును ప్రశ్నించనున్నారు సీఐడీ అధికారులు. విచారణలో భాగంగా ప్రతి గంటకు 5 నిమిషాలు చొప్పున చంద్రబాబుకు బ్రేక్ ఇస్తారు. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును విచారించేందుకు ప్రశ్నలను సిద్ధం చేశారు సీఐడీ అధికారులు. ఇకపోతే సీఐడీ విచారణ నేపథ్యంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద రెండంచెల భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. శుక్రవారం సాయంత్రం నుంచి లోకేష్ క్యాంప్ ఆఫీస్‌కు టీడీపీ ముఖ్య నేతలు చేరుకుంటారు.

Also Read:

Chandrababu Arrest: చంద్రబాబును చంపేందుకు కుట్ర జరుగుతోంది.. నారా లోకేష్ సంచలన ఆరోపణలు..

canada issue:కెనడియన్లకు భారతీయ వీసాలు నిలిపివేత…

Advertisment
Advertisment
తాజా కథనాలు