Chandrababu Custody: చంద్రబాబుకు సీఐడీ 15 ప్రశ్నలు.. సమాధానం చెప్పేనా?

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. రెండు కస్టడీలో భాగంగా తొలి రోజు ఆయన్ను అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే సిద్ధం చేసుకున్న క్వశ్చనైర్ ప్రకారం.. చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారులు.

Chandrababu Custody: చంద్రబాబుకు సీఐడీ 15 ప్రశ్నలు.. సమాధానం చెప్పేనా?
New Update

CID 15 Questions to Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. రెండు కస్టడీలో భాగంగా తొలి రోజు ఆయన్ను అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే సిద్ధం చేసుకున్న క్వశ్చనైర్ ప్రకారం.. చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారులు. ఉదయం 9.30 గంటలకే రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఐడీ అధికారుల బృందం.. జైలు కాన్ఫరెన్స్ హాల్‌లో చంద్రబాబును విచారిస్తున్నారు. న్యాయవాదుల సమక్షంలో తమ ప్రశ్నలకు సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కీలకంగా 15 ప్రశ్నలను సీఐడీ అధికారులు చంద్రబాబుకు సంధించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 120 ప్రశ్నలు అడిగే అవకాశం ఉందని తెలుస్తున్నా.. అందులో ఈ 15 ప్రశ్నలు అత్యంత కీలకం అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరి చంద్రబాబు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతారా? లేక సమాధానాలు దాటవేస్తారా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

సీఐడీ అధికారులు చంద్రబాబును అడగనున్న అత్యంత ముఖ్యమైన 15 ప్రశ్నలు ఇవే..?!

1.స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో మీ పాత్ర ఏంటి?

2.జీవోకు, ఒప్పందానికి ఎందుకు తేడా ఉంది?

3.కేబినెట్‌ ఆమోదం లేకుండా నిధుల్ని ఎందుకు విడుదల చేశారు?

4.13 చోట్ల ఉన్న సంతకం మీదేనా?

5.మీ పీఏ ఎందుకు పరారీలో ఉన్నాడు?

6.షెల్‌ కంపెనీల ఏర్పాటు వెనుక మీ పాత్ర ఏంటి?

7.నోట్‌ ఫైల్స్‌ ఎలా మాయమయ్యాయి ?

8.2018లో ఐటీ మీకు లేఖ రాస్తే ఎందుకు దాచారు?

9.లోకేష్‌, ఆయన ఫ్రెండ్‌ కిలారు రాజేష్‌ పాత్ర ఏంటి?

10.అధికారులు అభ్యంతరం చెప్పినా నిధులెలా ఇచ్చారు?

11.రూ.241 కోట్ల నిధులను ఏం చేశారు?

12.నిధుల కోసం ఆర్థిక శాఖపై ఒత్తిడి తెచ్చారా ?

13.సబ్‌ కాంట్రాక్టులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?

14.గంటా సుబ్బారావుకు, లక్ష్మీనారాయణ కంపెనీలకు నిధులు మళ్లాయా..?

15.షెల్‌ కంపెనీల ద్వారా నిధులు ఎవరికి చేరాయి..?

Also Read:

Telangana Elections: మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠ.. పోటీలో నిలిచేది ఆయనేనా?

Chandrababu Custody: నేడు చంద్రబాబును ప్రశ్నించనున్న సీఐడీ అధికారులు..

Bhuma Akhila Arrest: భూమా అఖిల ప్రియ అరెస్ట్.. నంద్యాలలో టెన్షన్ టెన్షన్

#chandrababu-naidu #cid #15-questions
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe