Christmas Celebrations: ఈ దేశాల్లో క్రిస్మస్ పండుగ జరుపుకోరు.. ఎందుకంటే..

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు. చర్చ్ లు  పండుగ ముస్తాబుతో మెరిసిపోతున్నాయి. అయితే, కొన్ని దేశాల్లో అంటే, ఆప్ఘనిస్తాన్, భూటాన్, ఇరాన్, సోమాలియా, పాకిస్థాన్ దేశాల్లో వివిధ కారణాలతో క్రిస్మస్ పండుగను జరుపుకోరు. 

New Update
Christmas Celebrations: ఈ దేశాల్లో క్రిస్మస్ పండుగ జరుపుకోరు.. ఎందుకంటే..

Christmas Celebrations: క్రిస్టియన్ ప్రజలకు క్రిస్మస్ చాలా ప్రత్యేకమైన రోజు.  ఎందుకంటే, ఈ రోజున యేసు ప్రభువు జన్మించాడని నమ్ముతారు. ఈ రోజు, ప్రజలు చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు. అలాగే వారి ప్రియమైన వారితో కలిసి ఉత్సాహంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈరోజు చర్చిలు అన్నీ ప్రత్యేక అలంకరణలతో మెరిసిపోతున్నాయి.  చాలా రోజుల ముందుగానే భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి సిద్ధమైన ప్రజలు క్రిస్మస్ వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. క్రిస్మస్ రోజును దాదాపుగా అన్నిదేశాల్లోనూ సెలవు దినంగా ప్రకటించారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఇంత ఉత్సాహంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను జరుపుకొని దేశాలు కూడా కొన్ని ఉన్నాయి.  ఏసు ప్రభువు పుట్టిన రోజు అనగా క్రిస్మస్ నాడు పెద్దల నుంచి  పిల్లల వరకు అందరిలో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తుంది.  క్రైస్తవులే కాకుండా ఇతర మతాల వారు కూడా ఈ పండుగ వేడుకల్లో(Christmas Celebrations) పాల్గొంటారు. ఈ రోజున, బహుమతులు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ రోజు పిల్లలకు చాలా ప్రత్యేకమైనది.. ఎందుకంటే, వారు తమ శాంటా (క్రిస్మస్ తాత) నుంచి వచ్చే బహుమతుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు.  ప్రస్తుతానికి, ఏయే దేశాల్లో క్రిస్మస్ జరుపుకోవడం లేదో తెలుసుకుందాం.

ఆఫ్ఘనిస్తాన్

సమాచారం ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్‌లో చాలా సంవత్సరాలుగా క్రిస్మస్ పండుగ(Christmas Celebrations) జరుపుకోవడం లేదు. ఇక్కడ ప్రజలు క్రైస్తవుల పండుగ క్రిస్మస్‌ను మతపరమైన భావాల కారణంగా జరుపుకోరు.

ఇరాన్

క్రిస్మస్ జరుపుకోని దేశాల గురించి చెప్పుకోవాల్సి వస్తే  అందులో ఇస్లామిక్ దేశం ఇరాన్ కూడా ఉంది. సమాచారం ప్రకారం, ఇక్కడ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడంపై నిషేధం ఉంది.

భూటాన్

భారతదేశ పొరుగు దేశం భూటాన్‌లో కూడా, క్రిస్మస్ రోజు(Christmas Celebrations)కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. అలాగే  ఈ పండుగ ఇక్కడ క్యాలెండర్‌లో భాగంగా ఉండదు. ఇక్కడి జనాభాలో 75 శాతం మంది బౌద్ధమతాన్ని విశ్వసిస్తున్నారు.  అంచనాల ప్రకారం, భూటాన్‌లోని జనాభాలో కేవలం 1 శాతం మాత్రమే క్రైస్తవ మతానికి చెందినవారు.

Also Read: ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్.. ఏకంగా 30 వేల మంది ఔట్.. కారణమిదే!

సోమాలియా

సోమాలియాలో కూడా  క్రిస్మస్ వేడుకలను(Christmas Celebrations) నిషేధించారు. మతపరమైన మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పర్యాటకులు తమ ఇళ్లలోనే ఈ పండుగ జరుపుకునే అవకాశం ఉన్నప్పటికీ,  పండుగను బహిరంగంగా జరుపుకోవడంపై నిషేధం ఉంది.

పాకిస్తాన్

డిసెంబర్ 25 పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలీ జిన్నా జన్మదినం. అందువల్ల పాకిస్తాన్‌లో కూడా క్రిస్మస్ జరుపుకోరు. అయితే, ఇక్కడ ప్రజలకు ఈ రోజు సెలవుదినం.

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు