Kannappa Movie: మంచు విష్ణు 'కన్నప్ప' కోసం ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్..!

హీరో మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కన్నప్ప’. ఇటీవలే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ న్యూజీలాండ్ లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం కోసం ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ్ పని చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం.

Kannappa Movie: మంచు విష్ణు 'కన్నప్ప' కోసం ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్..!
New Update

Prabhu Deva Joins in Mnchu Vishnu's Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భక్త కన్నప్ప. ఫాంటసీ డ్రామా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ బాబు (Mohan Babu) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే న్యూజీలాండ్ లో ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. సెకండ్ షెడ్యూల్ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

కన్నప్ప సెట్స్ లో ప్రభుదేవా

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా (Prabhu Deva) పనిచేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. సినిమాలోని పాటలకు ఆయన కొరియోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా ఉండబోతుందని, ప్రభుదేవా రాకతో 'కన్నప్ప' మరో స్థాయికి వెళ్లిందని తెలిపింది. ఈ సందర్భంగా న్యూజిలాండ్ లో ప్రభుదేవాకు ఘన స్వాగతం పలికింది చిత్ర యూనిట్.

publive-image

Also Read: This Week OTT Release: ఈ వారం ఓటీటీలో సూపర్ హిట్ చిత్రాలు.. అందరూ వెయిట్ చేస్తున్న ఆ సినిమా కూడా

ప్రస్తుతం ఈ మూవీ కోసం న్యూజిలాండ్, థైలాండ్ లోని హైలీ టాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని కీలక పాత్రల కోసం స్టార్ కాస్ట్ మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, మోహన్ బాబు, శరత్ కుమార్ భాగమయ్యారు. ఇక తాజాగా స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఎంట్రీతో సినిమా పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న మంచు విష్ణుకు.. ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Also Read: Ambani Wedding: సచిన్, ధోనీ, షారుఖ్, చెర్రి అందరూ ఒకే చోట.. అంబానీ ప్రీవెడ్డింగ్ లో తళుక్కుమన్న సెలబ్రెటీలు!

#choreographer-prabhudev #manchu-vishnu-movie #manchu-vishnu-bhaktha-kannappa
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe