కోమటిరెడ్డి బ్రదర్స్ సంగతి చూస్తా! చిరుమర్తి లింగయ్య సెన్సేషన్ కామెంట్స్..
కోమటిరెడ్డి బద్రర్స్ పై సంచలన కామెంట్స్ చేశారు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. నల్లగొండ, మునుగోడులో వారిద్దరూ ఎలా గెలుస్తారో చూస్తానని అన్నారు. తనను చూసి ఓర్వడం లేదని, ఇక నుంచి తన ప్రచారం మునుగోడు, నల్లగొండలోనే అని చెప్పారు లింగయ్య.
Chirumarthi Lingaiah: కోమటిరెడ్డి బ్రదర్స్‌పై నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(Chirmarthi Lingaiah) తొలిసారి సంచలన కామెంట్స్ చేశారు. నల్లగొండ(Nalgonda) జిల్లా నకిరేకల్ మండలంలోని పాలెం, నోముల గ్రామాల్లో చిరుమర్తి లింగయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కోమటిరెడ్డి బ్రదర్స్ టార్గెట్‌గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ బ్రోకర్స్ అంటూ ధ్వజమెత్తారు. రాజకీయ వ్యభిచారులు అంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రజలే వారికి సమాధి కడతారని అన్నారు చిరుమర్తి లింగయ్య. నకిరేకల్ నియోజకవర్గంలో నాయకులను డబ్బులతో కొంటున్నారంటూ కోమటిరెడ్డి బ్రదర్స్‌పై సంచలన ఆరోపణలు చేశారు లింగయ్య.
అంతేకాదు.. తాను పోటీ చేస్తున్న నకిరేకల్ నియోజకవర్గంలో శనివారం నుంచి ప్రచారం చేయబోనని, ఇక నుంచి తన ఫోకస్ అంతా కోమటిరెడ్డి బ్రదర్స్ పోటీ చేస్తున్న నల్గొండ, మునుగోడుపైనే ఉంటుందన్నారు ఎమ్మెల్యే లింగయ్య. వారిద్దరినీ ఓడించడమే లక్ష్యంగా తాను ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తానని అన్నారు. 2014 ఎన్నికల సమయంలో తాను ఓడిపోవడానికి కోమటిరెడ్డి బ్రదర్సే కారణం ఆరోపించారు లింగయ్య. అంతేకాదు.. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడింది కూడా వారిద్దరేనని ఆరోపించారు. ప్రజల సొమ్మును దోచుకుని, డబ్బులతో రాజకీయాలు చేస్తున్నారంటూ తీవ్ర పదజాలతో కోమటిరెడ్డి బ్రదర్స్‌పై విరుచుకుపడ్డారు చిరుమర్తి లింగయ్య. దళితుడిని అయినందునే.. తనపై ఓర్వలేక తనను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
2018 వరకు కోమటిరెడ్డి బ్రదర్స్ అడుగుజాడల్లో..
2009 అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండతో నకిరేకల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలపొందారు చిరుమర్తి లింగయ్య. ఆ తరువాత 2014లో పోటీ చేసినా ఓటమిపాలయ్యారు. 2018లో మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటికి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓడిపోయాడు. కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారిపోయింది. దాంతో చిరుమర్తి లింగయ్య.. తనకు అండగా నిలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాదని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి వరకు కోమటిరెడ్డి బ్రదర్స్ అండదండలతో, వారి అడుగుజాడల్లో నడచుకున్న చిరుమర్తి.. ఒక్కసారిగా డేర్ చేసి సపరేట్ అయ్యారు. నాటి నుంచి నేటి వరకు వారికి అంతే దూరం మెయింటేన్ చేస్తున్నారు.
మారిన రాజకీయ సమీకరణాలు..
అయితే, తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులు అనుగుణంగా నకిరేకల్ నియోజకవర్గంలోనూ సిచ్యూయేషన్స్ మారాయి. మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బ్రదర్స్, వేముల వీరేశం ఒక్కటయ్యారు. కోమటిరెడ్డి ఆశీర్వాదంతో.. వేముల నకిరేకల్ నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. బీఆర్‌ఎస్‌లో ఉన్న నేతలంతా కాంగ్రెస్‌లో మారిపోతున్నారు. దాంతో నియోజకవర్గంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. చిరుమర్తి లింగయ్య సెంటిమెంట్ డైలాగ్స్ వదులుతున్నట్లు భావిస్తున్నారు పొలిటికల్ విశ్లేషకులు.

Also Read:
కాళేశ్వరం పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక
ప్లీజ్ నన్ను మైలార్డ్ అని పిలవకండి…