Suma Kanakala's: యాంకర్ సుమకు చిరంజీవి అదిరిపోయే గిఫ్ట్..!

ప్రముఖ యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల ‘బబుల్‍గమ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ‘బబుల్‍గమ్’ సినిమాలోని సెకండ్ సాంగ్ 'Izzat' వీడియోను మెగాస్టార్ చిరంజీవి నవంబర్ 23 న లాంచ్ చేయనున్నారు.

Suma Kanakala's: యాంకర్ సుమకు చిరంజీవి అదిరిపోయే గిఫ్ట్..!
New Update

Suma Kanakala's Son Roshan Movie: టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ , ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల దంపతుల కుమారుడు రోషన్ కనకాల ‘బబుల్‍గమ్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నారు. క్షణం, కృష్ణ అండ్ లీల చిత్రాల ఫేమ్ డైరెక్టర్ రవికాంత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించాయి. ‘బబుల్‍గమ్’ బ్యూటీఫుల్ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రోషన్. ఇటీవలే ఈ సినిమాకు ఫస్ట్ లుక్ పోస్టర్ ను టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సోషల్ మీడియా వేదిక రిలీజ్ చేశారు.
‘బబుల్‍గమ్’ టీమ్ అండ్ హీరో రోషన్ కు అభినందనలు తెలిపారు. నీ సొంత మార్క్ క్రియేట్ చేసుకొని.. రాజీవ్, సుమ గర్వ పడేలా చేయాలనీ తన బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

publive-image

Also Read: Raashi khanna: ఎంత ముద్దుగా ఉందో.. మేకప్‌ లేని రాశిఖన్నాను చూస్తే ఫ్లాట్‌ అవుతారు

రీసెంట్ గా ఈ సినిమా టీజర్ లాంచ్ సందర్భంగా నేచురల్ స్టార్ నాని స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో నాని ‘బబుల్‍గమ్’ టీమ్ అండ్ రోషన్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం సుమ కూడా తన కొడుకు సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుమ, తన కొడుకు ఇద్దరు కలిసి చేసిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. ‘బబుల్‍గమ్’ సినిమాలోని సెకండ్ సాంగ్ 'Izzat' వీడియోను మెగాస్టార్ చిరంజీవి నవంబర్ 23 న లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఫస్ట్ సాంగ్ 'Habibi Jilebi' విడుదలయ్యి యు ట్యూబ్ లో 2 మిలియన్ వ్యూస్ సాధించింది.

publive-image

Also Read: Mahesh babu Guntur Karam: లీకైన గుంటూరు కారం సాంగ్ షూట్.. మహేష్ స్టెప్పులు సూపర్.. ఓ లుక్కేయండి!

#bubblegum-movie
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి