ఇక… ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి ఆస్కార్ రావడంతో, రామ్ చరణ్ గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. యాక్సిడెంట్ తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరమైన, సాయిధరమ్ తేజ్.. ‘విరూపాక్ష’తో హిట్ కొట్టి, కమ్‌బ్యాక్ ఇచ్చాడు. కొన్నిరోజుల ముందు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇప్పుడేమో రామ్ చరణ్ కు కూతురు పుట్టింది. ఇలా ఒకటి తర్వాత ఒకటి గుడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. అయితే మెగా హీరోలందరికీ ఒక పేరు బాగా కలిసొస్తుందనే టాక్ వినిపిస్తుంది.
ఇలా మెగాఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు. మరోవైపు మెగా హీరోలందరూ వరుసగా మూవీస్ చేస్తూ, పుల్ బిజీ. ఇలాంటి టైంలో మెగాహీరోల సినిమా టైటిల్స్ లోని ఓ పేరు సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. ఇక ‘విరూపాక్ష’ తర్వాత సాయితేజ్ నటిస్తున్న మూవీకి, ‘గాంజా శంకర్’ అనే టైటిల్ రిజిస్టర్ చేసినట్లు టాక్ రావడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీకి సంపత్ నంది దర్శకత్వం వహించనున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
ఇక గతంలో చిరంజీవి హీరోగా ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘శంకర్ దాదా జిందాబాద్’ మూవీ చేశారు. పవన్ కల‍్యాణ్ ‘గుడుంబా శంకర్’ చేశారు. ఇప్పుడు చిరు మళ్లీ ‘భోళా శంకర్’ మూవీ చేస్తున్నారు. ఇలా అందరు ‘శంకర్’ అనే పేరుని టైటిల్ గా ఉపయోగించడం సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. భవిష్యత్తులో మిగతా మెగా హీరోలు కూడా ఈ పేరుతో సినిమాలేమైనా చేస్తారేమో చూడాలి.