/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/chiru-2-jpg.webp)
Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు శుభాకంక్షాలు తెలిపారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 70 వేల మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అన్న చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది.
Also Read: పవన్ కళ్యాణ్ ఘన విజయం.. ఆయన భార్య ఏం చేసిందంటే?
నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను' అని ట్వీట్ లో పేర్కొన్నారు.
డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం…
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2024