Pashupati Paras : ఆ ఇద్దరు కౌగిలించుకున్నారు.. మామ, మేనల్లుడిని కలిపిన మోడీ..!!

దివంగత నేత రాంవిలాస్ పాశ్వన్...2021లో మరణించారు. ఆయన స్థాపించిన లోక్ జనశక్తిపార్టీ రెండుగా చీలిపోయిది. ఆయన కుమారుడి, సోదరుడికి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో తమ్ముడు పశుపతి కుమార్ పరాస్ పార్టీని రెండుగా చీల్చాడు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే వీరిద్దర్నీ ఒకటి చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చాలానే చేసింది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి మేనల్లుడు, మేనమామ ఇద్దరూ హాజరయ్యారు. మేనమామ పాదాలను తాగి..కౌగిలించుకున్నాడు చిరాగ్ పాశ్వాన్.

New Update
Pashupati Paras : ఆ ఇద్దరు కౌగిలించుకున్నారు.. మామ, మేనల్లుడిని కలిపిన మోడీ..!!

ఇటీవల, 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బెంగళూరులోని ప్రతిపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యాయి. విపక్షాలు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎజెండాను నిర్దేశించగా, మరోవైపు, ప్రతిపక్షాలకు పోటీ ఇచ్చేందుకు ఎన్డీయే 38 పార్టీలతో సమావేశం నిర్వహించింది. ఈ ఎన్డీయే సమావేశం ఢిల్లీలో జరిగింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సమావేశంలో లోక్ జనశక్తి పార్టీలోని రెండు వర్గాలు పాల్గొన్నాయి. సమావేశంలో భిన్నమైన దృశ్యం కనిపించింది. చిరాగ్ పాశ్వాన్ తన మేనమామ పరాస్ కాళ్లు మొక్కి..కౌలిగించుకున్నాడు. పార్టీ చీలిక తర్వాత చిరాగ్ పాశ్వాన్, అతని మామ పశుపతి పరాస్ వేరువేరుగా ఉంటున్నారు.

publive-image

రామ్ విలాస్ పాశ్వాన్ మరణించినప్పటి నుండి ఇద్దరి మధ్య వైరం ఎక్కువైంది. వీరి మధ్య వైరం పార్టీని రెండుగా చీల్చింది. ఇప్పుడు ఇద్దరు నాయకులు హాజీపూర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేస్తామని వెల్లడించార. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), లోక్ జనశక్తి పార్టీల విలీనం ఉండదని పశుపతి పరాస్ ఇప్పటికే చెప్పారు.

NDA సమావేశంలో, చిరాగ్ పాశ్వాన్ తన మామ మనస్సును గెలుచుకోవడమే కాకుండా ప్రధాని మోదీ కూడా చిరాగ్ పాశ్వాన్ ను కౌగిలించుకున్నాడు. చిరాగ్‌కి హాజీపూర్‌లో ఉనికి లేదని, అతను అక్కడ తన సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నాడో తెలియదని ఇటీవల పశుపతి పరాస్ సంచలనవ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి చిరాగ్..తన మేనమామకు కౌంటర్ ఇస్తారని అంతా అనుకున్నారు. ముఖ్యంగా పశుపతి పరాస్ ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.

రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ జీవించి ఉన్నప్పుడు చిరాగ్‌ హాజీపూర్‌ లోక్‌సభ నుంచి ఎందుకు పోటీ చేయలేదని పరాస్‌ ప్రశ్నించారు. అతను జముయి సీటును ఎందుకు ఎంచుకున్నాడు? సమావేశం తర్వాత చిరాగ్ ఎన్డీయేలో చేరడాన్ని ఆయన వ్యతిరేకించనప్పటికీ, ఆయనను స్వాగతించక తప్పదని భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఇద్దరూ కలిసి వచ్చే ఎన్నికల్లో గెలుపొందడంపై దృష్టి సారించనున్నారు.

కొన్నాళ్లక్రితం, అమిత్ షాతో జరిగిన సమావేశంలో చిరాగ్ పాశ్వాన్ 6 లోక్‌సభ, ఒక రాజ్యసభ సీటు గురించి చర్చించినట్లు వార్తలు వచ్చాయి. అయితే చిరాగ్ పెట్టిన ఖండిషన్ను బీజేపీ అంగీకరించిదా లేదా అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. అయితే, ఆయనకు బీజేపీ నుంచి సానుకూల స్పందన వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు