AP News: తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా వర్షం పడుతోంది. మరో రెండు రోజులు ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాల్లోకి నీరు రావటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం-దోర్నాల మండలం చింతలచెంచుగూడెం వద్ధ రాళ్ళవాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. గత రెండు రోజులుగా పలు గ్రామల మధ్య రాకపోకలకు అంతరాయం కలగటంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాళ్ళ వాగులో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల సిబ్బంది చిక్కుకున్నారు. విషయం గమనించిన చెంచుగూడెం వాసులు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రాణాపాయం తప్పడంతో సిబ్బంది, స్థానిక ప్రజలు ఊపిరి పిల్చుకున్నారు.
Also Read : ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు సేఫ్.. తెలంగాణ పోలీసుల కీలక ప్రకటన!