TS: బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌.. మాజీ ఎమ్మెల్సీ గుడ్ బై!

బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. నల్గొండ ఎంపీ టికెట్‌ తనకు కేటాయించకపోవడంతో బీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్టు ప్రకటించారు. ఆయన బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.

New Update
TS: బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌.. మాజీ ఎమ్మెల్సీ గుడ్ బై!

CHINNAPAREDDY: బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. నల్గొండ ఎంపీ టికెట్‌ తనకు కేటాయించకపోవడంతో బీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్టు ప్రకటించారు. బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

ఈసారి కూడా మొండిచేయి..
ఈ మేరకు నల్గొండ ఎంపీ టికెట్ సీనియర్ నేత కంచర్ల శ్రీనివాసరెడ్డి పేరును ప్రకటించడంతో తేరా చిన్నపరెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. తన రిజైన్‌ లెటర్‌ను కేసీఆర్‌కు పంపించారు. ఇక 2019లో బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన చిన్నపరెడ్డి మూడేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఆశించి భంగపడ్డ చిన్నపరెడ్డి.. ఈసారి కూడా తనకు మొండిచేయి చూపించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఆయన బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరగుతోంది.

Advertisment
తాజా కథనాలు