G20: పుతిన్‌ బాటలోనే జిన్‌పింగ్‌.. జీ20 సమావేశానికి మరో అగ్రనేత డుమ్మా!

జీ20 శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ డుమ్మా కొట్టనున్నారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూడా రావడం లేదని చెప్పిన విషయం తెలిసిందే. జిన్‌పింగ్‌కి బదులుగా 'లీ కియాంగ్' ఈ శిఖరాగ్ర సమావేశానికి బీజింగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని తెలుస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ జీ20 మీటింగ్‌కు హాజరవుతున్నారు.

New Update
G20: పుతిన్‌ బాటలోనే జిన్‌పింగ్‌.. జీ20 సమావేశానికి మరో అగ్రనేత డుమ్మా!

After Putin, China’s Xi Jinping likely to skip G20 summit in Delhi: ఇండియా ఏదైనా సాధించిందంటే అందరికంటే ముందుగా కుళ్లుకునే వాళ్లలో చైనా (china)ఫస్ట్ ఉంటుంది. జీ20(g20) సమావేశాలకు ఇండియా తొలిసారి హోస్ట్ చేస్తుండగా ఈ మీటింగ్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ డుమ్మా కొట్టనున్నట్టు సమాచారం. రాయిటర్స్(Reuters) ప్రకారం, చైనా ప్రీమియర్ 'లీ కియాంగ్' ఈ శిఖరాగ్ర సమావేశానికి బీజింగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని తెలుస్తోంది. జిన్‌పింగ్‌(Jinping) ఎందుకు రావడంలేదో ఇప్పటివరకు క్లారిటీలేదు.

పుతిన్‌ కూడా రావట్లేదు:
జీ20 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు భారత్‌కు రాని రెండో ఉన్నత స్థాయి నాయకుడు జిన్‌పింగ్‌. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(putin) ఇప్పటికే జీ20 సదస్సుకు హాజరు కాలేరని క్రెమ్లిన్ ప్రకటించింది. గ్లోబల్ సమ్మిట్‌లో పుతిన్ తరపున రష్యా విదేశాంగ మంత్రి సెగీ లావ్‌రోవ్ పాల్గొంటారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9-10 వరకు జీ20 శిఖరాగ్ర సమావేశాన్ని భారత్‌ నిర్వహిస్తోంది. ఈ ఏడాది చైనా అధ్యక్షుడు.. రష్యా, దక్షిణాఫ్రికాను మాత్రమే సందర్శించారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు జిన్‌పింగ్‌ కొద్ది రోజుల క్రితమే దక్షిణాఫ్రికా వెళ్లారు. ఆ సమయంలో చైనా అభ్యర్థన మేరకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జిన్‌పింగ్‌, ప్రధాని మోదీ కొద్దిసేపు సమావేశమయ్యారు.

అమెరికా వస్తుంది..!
మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ జీ20 మీటింగ్‌కు హాజరవుతున్నారు. ఈ విషయాన్ని అమెరికా గతంలోనే స్పష్టం చేసింది. ఇదే సమయంలో అమెరికా రైవల్‌ కంట్రీస్‌ రష్యా, చైనా అధ్యక్షులు జీ20 సమావేశానికి డుమ్మా కొట్టనుండడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నిజానికి ఈ మీటింగ్‌ను అమెరికా,చైనా ఒకే వేదికపై కనపడే సదస్సుగా ప్రపంచం చూస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఏ మాత్రం సయోధ్య లేదు. రెండు అగ్రరాజ్యాల మధ్య వాణిజ్యం, రాజకీయ ఉద్రిక్తతల నెలకొని ఉన్నాయి. గత నవంబర్‌లో ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బైడెన్‌ను జిన్‌పింగ్‌ చివరిసారిగా కలిశారు. మరోవైపు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 15వ బ్రిక్స్ సదస్సుకు కూడా పుతిన్ హాజరుకాలేదు. ఆయనకు బదులుగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రాతినిధ్యం వహించారు. యుక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు సంబంధించి అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ICC) జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌పై ఆందోళనల కారణంగా అధ్యక్షుడు వేరే దేశాలకు వెళ్లడం లేదని సమాచారం.

ALSO READ: మోడీపై 80 శాతం మందికి పాజిటివ్ కార్నర్ … పీఈడబ్ల్యూ సర్వేలో ఆసక్తికర విషయాలు…!

Advertisment
Advertisment
తాజా కథనాలు