Childrens Height: ఆ విటమిన్ లోపం ఉంటే ఎత్తు పెరగరు.. తప్పక తెలుసుకోండి

పూర్వీకులు పొడుగ్గా ఉంటే పిల్లలు పొడుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ శరీరం ఎత్తు ఎంత పెరుగుతుందనేది DNAపై 80 శాతం ఆధారపడి ఉందట.10 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్నప్పుడు పిల్లలు వేగంగా పెరుగుతారు. ఈ కాలంలో వారికి మంచి ఆహారం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.

New Update
Childrens Height: ఆ విటమిన్ లోపం ఉంటే ఎత్తు పెరగరు.. తప్పక తెలుసుకోండి

Childrens Height: పిల్లల శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే.. అతని శరీర అభివృద్ధికి ఆటంకం ఏర్పడవచ్చని నిపుణులు అంటున్నారు. మీరు మీ చుట్టూ చూస్తే.. ఈ సమాజంలో వివిధ రంగులు, శరీర రకాలు ఉన్నవారు కనిపిస్తారు. కొందరికి డార్క్ కాంప్లెక్షన్, కొందరికి ఫెయిర్ కాంప్లెక్షన్ ఉంటుంది. కొందరి ఎత్తు ఎక్కువ, మరికొందరికి తక్కువగా ఉంటారు. ఇప్పుడు ఈ విషయాలు ఎలా నిర్ణయించబడతాయి అనే ప్రశ్న తలెత్తుతుంది. అంటే ఎవరైనా పొడుగ్గా ఉంటారా లేక పొట్టిగా ఉంటారా అనేది శరీరంలోని ఏ మూలకం నిర్ణయిస్తుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నివేదిక నిపుణులు సర్వే చేశారు. దానికి కీలక విషయాలు వెల్లడించారు. పిల్లల ఎత్తుపై కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పోషణ ద్వారా నిర్ణయించబడుతుంది:

జనంలో సాధారణ నమ్మకం ఏమిటంటే.. ఒక వ్యక్తి శరీరం పొడవు, ఎత్తు అతను స్వీకరించే పోషకాహారంపై ఆధారపడి ఉంటుంది. అయితే.. కొంతమంది నిపుణులు అలా నమ్మరు. నిజానికి శరీరం ఎత్తు ఎంత పెరుగుతుంది అనేది మన DNAపై 80 శాతం ఆధారపడి ఉంటుంది. అంటే పూర్వీకులు పొడుగ్గా ఉంటే ఇప్పుడున్న పిల్లలు కూడా పొడుగ్గా ఉండే అవకాశాలు ఫుల్‌గా ఉన్నాయి. కొన్ని విటమిన్లు శరీర ఎత్తులో 20% పెరుగుదల లేదా తగ్గుదలకు కారణమవుతాయి.

విటమిన్ డి పెద్ద పాత్ర:

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నివేదిక ప్రకారం.. పిల్లల శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే.. అతని శరీర అభివృద్ధికి ఆటంకం ఏర్పడవచ్చని అంటున్నారు.

ఎలాంటి ఆహారం ఉండాలి:

పిల్లల శరీరం అభివృద్ధిని కోరుకుంటే.. అతనికి ప్రోటీన్లు విటమిన్లు అధికంగా ఉండే ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించాలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పిల్లల వయస్సు 10 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్నప్పుడు. ఈ వయస్సులో పిల్లలు వేగంగా పెరుగుతారు. ఈ కాలంలో వారికి మంచి ఆహారం అవసరం. ఈ కాలంలో పిల్లలకు మంచి ఆహారం అందిస్తే వారి ఎత్తు కూడా పెరగడంతో పాటు శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితు.. కొన్నిసార్లు కొన్ని వ్యాధుల కారణంగా.. శరీరం అభివృద్ధి ఆగిపోతుంది. ఆ సమయంలో బిడ్డ శారీరకంగా అభివృద్ధి చెందకపోతే.. మొదట వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: క్యాన్సర్, బీపీకి మాత్రమే ఫేక్ మెడిసిన్స్ కాదు.. ఇప్పుడు డిప్రెషన్‌కు కూడా నకిలీ మందులు.. కర్మరా బాబు

Advertisment
Advertisment
తాజా కథనాలు