హైదరాబాద్‌లో రేసర్లు చెలరేగిపోతున్నారు. ఎక్కడపడితే అక్కడ విదేశీ కార్లతో రేసింగ్‌లు చేస్తూ.. స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. రేసింగ్‌కు దిగుతున్న వారిపై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. రేసర్లు వారి పద్దతి మార్చుకోవడంలేదు. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో రేసర్లు రెచ్చిపోయారు. స్థానికులు వెళ్తున్న రోడ్లపై రూయ్.. రూయ్.. అంటూ మితిమీరిన వేగంతో వెళ్తూ పాదాచారులను భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో పలువురు తమమీదకు ఏదో వస్తుందనే భయంతో పరిగెత్తారు.
అనంతరం యువత రేసింగ్‌కు దిగినట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రేసింగ్‌కు పాల్పడ్డ ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారంతా బడా బాబుల పిల్లలుగా గుర్తించారు. యువకులు రేసింగ్‌కు ఉపయోగించిన కార్లను స్వాధీనం చేసుకొని నార్సింగీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వీరిని రేసింగ్ కోసం ప్రోత్సహించింది ఎవరనే దానిపై విచారణ చేపట్టినట్లు తెలిపారు.
మరోవైపు యువకులు కారు, బైక్ రేసింగ్‌లకు దిగొద్దని పోలీసులు సూచించారు. రేసింగ్‌ల వల్ల డ్రైవింగ్ చేసే వారితో పాటు, ఇతర వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతారని తెలిపారు. రేసింగ్‌లో ఎలాంటి ప్రమాదమైనా జరగవచ్చని తెలిపారు. అంతే కాకుండా విదేశీ కార్లు వల్ల వచ్చే శబ్దం వల్ల పాదాచారులతో పాటు సమీప ఇళ్లలో ఉండే వారికి హార్టేటాక్‌లు రావచ్చని తెలిపారు. యువకులు ఇలాంటి వాటికి దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.