Child Sleeping: మీ చిన్నారి అర్థరాత్రి వరకు నిద్రపోవడం లేదా..? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

పిల్లలు రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతే.. త్వరగా నిద్రపోవడానికి సహాయపడే కొన్ని సులభమైన ఉపాయాలు ఉన్నాయి. అయితే ప్రతిరోజూ అదే సమయానికి పిల్లవాడిని నిద్రించడానికి ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు. ఆ సమయానికి అలవాటుపడి సులువుగా నిద్రలోకి జారుకుంటారని అంటున్నారు.

New Update
Child Sleeping: మీ చిన్నారి అర్థరాత్రి వరకు నిద్రపోవడం లేదా..? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

Child Sleeping: పిల్లలు సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వారి ఆరోగ్యం, అభివృద్ధికి మంచి నిద్ర ముఖ్యమని నిపుణులు అంటున్నారు. పిల్లలు రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతే.. త్వరగా నిద్రపోవడానికి సహాయపడే కొన్ని సులభమైన ఉపాయాలు ఉన్నాయి. అయితే ప్రతిరోజూ అదే సమయానికి పిల్లవాడిని నిద్రించడానికి ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో వారి శరీరం ఆ సమయానికి అలవాటుపడి సులువుగా నిద్రలోకి జారుకుంటారు.

చిన్నారులకు మంచి నిద్ర కావాలంటే:

  • పిల్లవాడిని రోజులో చాలా ఆడనివ్వాలి. ఆడటం వల్ల వారి శక్తి పోతుంది, వారు అలసిపోతారు. రాత్రి బాగా నిద్రపోతారు.
  • నిద్రపోయే ముందు పిల్లలకు ప్రశాంతమైన సంగీతాన్ని వినేలా చేయండి. ఇది వారి మైడికి ప్రయోజనకరంగా ఉంచి శాంతింపజేస్తుంది. ఇలా చేస్తే నిద్రపోవడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
  • నిద్రపోయే ముందు పిల్లలను టీవీ, మొబైల్ ఫోన్, ఇతర స్క్రీన్‌లకు దూరంగా ఉంచాలి. ఇది కాంతి, కార్యకలాపాలు నిద్రకు భంగం కలిగిస్తాయి.
  • నిద్రపోయే ముందు పిల్లలకు స్నానం చేయడం, కథలు చెప్పడం లేదా తేలికపాటి మసాజ్ చేయడం వంటివి చేయాలి. ఇది వారిని నిద్రకు సిద్ధం చేస్తుం. మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: సాక్స్‌లు దుర్వాసన వస్తున్నాయా? అయితే ఈ టిప్స్‌ మీ కోసమే!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు