Stomach Flu: పిల్లలకు పదేపదేగా కడుపునొప్పి వస్తుందా..? అది స్టమక్ ఫ్లూ కావచ్చు?

అధిక వేడి కారణంగా వైరల్ గ్యాస్ట్రోఎంటెరిటిస్ సమస్య వస్తుంది. ఈ కడుపు వ్యాధి కడుపు ఫ్లూకి దారి తీసుకుంది. ఇది సోకిన వ్యక్తి కలుషితమైన ఆహారం, నీరు వల్ల సంభవిస్తుంది. స్టమక్ ఫ్లూ ఇన్ పిల్లల్లో వచ్చే లక్షణాల నివారణ తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Stomach Flu: పిల్లలకు పదేపదేగా కడుపునొప్పి వస్తుందా..? అది స్టమక్ ఫ్లూ కావచ్చు?

Stomach Flu in Children: మండుతున్న వేడి ప్రతిఒక్కర్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా అనేక వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. వాంతులు, విరేచనాలు, కడుపు సమస్యలు వ్యాపిస్తున్నాయి. ఈ సీజన్‌లో చిన్న పిల్లలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. స్టమక్ ఫ్లూ బారిన పడిన పలువురు చిన్నారులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. దీంతో కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. పిల్లలకు కడుపునొప్పి వస్తుంటే నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు అంటున్నారు. అది స్టమక్ ఫ్లూ కావచ్చని అవ్వచ్చని అంటున్నారు. చిన్నపాటి అజాగ్రత్త పిల్లల ఆరోగ్యాన్ని తీవ్రంగా పాడుచేస్తుంది. దీనికి సమర్థవంతమైన చికిత్స లేదు, కానీ ఖచ్చితంగా నివారణ ఉంది. ఇలాంటి సమస్యల్ని ఎలా నివారించాలో.. ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

కలుషిత ఆహారం, కడుపునొప్పి:

  • వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆహారం చాలా త్వరగా పాడైపోతుందని వైద్యులు చెబుతున్నారు. నోరోవైరస్, ఆస్ట్రోవైరస్ అనే బాక్టీరియా తింటే వస్తాయి. పిల్లలు ఈ కలుషిత ఆహారాన్ని తింటే, వారి కడుపులో ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. దీనిని కడుపు ఫ్లూ అని కూడా పిలుస్తారు.
    సాధారణంగా..  స్టమక్ ఫ్లూ కేసులు వేసవి, వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే ఈ సీజన్లలో వేడి, తేమ వల్ల ఈ వ్యాధి బ్యాక్టీరియా వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తాయి. ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు, వండిన ఆహారం కూడా త్వరగా పాడవుతాయి.

స్టొమక్ ఫ్లూకి కారణాలు:

  • పిల్లలు పాత లేదా కలుషితమైన ఆహారాన్ని తిన్నప్పుడు.. బ్యాక్టీరియా వారి ప్రేగులలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల వారికి విరేచనాలు, వికారం, వాంతులు, జ్వరం, కడుపు తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. ఇది నిర్జలీకరణాన్ని పెంచుతుంది. ఇది సమయానికి చికిత్స చేయకపోతే.. కడుపు ఫ్లూకి దారితీస్తుంది. ఇది అంత తీవ్రమైన వ్యాధి కాదని.. సకాలంలో వైద్యం అందించాలని వైద్యులు చెబుతున్నారు.

కడుపు ఫ్లూ లక్షణాలు:

  • కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, అధిక చెమటలు, వాంతులు మరియు విరేచనాలు, జ్వరం, కండరాల నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.

కడుపు ఫ్లూని నివారించే విధానం:

  • ఎల్లప్పుడూ తాజా ఆహారాన్ని తినాలి. నీరు పుష్కలంగా తాగటం, శరీరంలో నీటి పరిమాణాన్ని తగ్గించవద్దని నిపుణులు చెబుతున్నారు. వీధి ఆహారాన్ని తినవద్దు.
    మీకు కడుపు నొప్పి ఉంటే, డాక్టర్ వద్దకు వెళ్తె మంచిదని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: కుండిలో దోసకాయను ఇలా పండించవచ్చు.. భలే చిట్కా!

Advertisment
Advertisment
తాజా కథనాలు