టైమ్స్ నౌ నుంచి వైదొలగిన చీఫ్ ఎడిటర్ రాహుల్ శివశంకర్..!! టైమ్స్ నౌ నుంచి చీఫ్ ఎడిటర్ రాహుల్ శివశంకర్ వైదొలిగారు. ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. ఛానెల్ నుంచి రాహుల్ శివశంకర్ తప్పుకుంటున్నట్లు న్యూస్ లాండ్రీ తెలిపింది. శివశంకర్ తన ట్విట్టర్ బయోను అప్ డేట్ చేయడంతో ఈ వార్త నిజమేనని నిరూపితమైంది. శివశంకర్ ఎడిటర్ ఇన్ చీఫ్ టైమ్స్ నౌ 2016 నుంచి 2023 అని తన బయోని మార్చారు. By Bhoomi 21 Jun 2023 in నేషనల్ New Update షేర్ చేయండి టైమ్స్ నౌ చీఫ్ ఎడిటర్ రాహుల్ శివశంకర్ ఆ సంస్థకు గుడ్ బై చెప్పారు. శివశంకర్ తప్పుకున్నట్లు న్యూస్ లాండ్రీ తెలిపింది. శివశంకర్ తన బయోను మార్చడంతో ఈ వార్త వాస్తవమేనని నిరూపితమైంది. తన బయోను కూడా మార్చేశారు శివశంకర్. ఎడిటర్ ఇన్ చీఫ్ టైమ్స్ నౌ 2016 నుంచి 2023 అంటూ మార్చేశారు. అంతేకాదు ప్రోగ్రెసివ్ కన్జర్వేటివ్ జర్నలిస్టు అని తన బయోలో మార్చారు. అటు ఛానెల్ హెచ్ఆర్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులకు పంపించిన ఇంటర్నల్ కమ్యూనికేషన్ లో టైమ్స్ నౌ ఎడిటర్ ఇన్ ఛీఫ్ రాహుల్ ఛానెల్ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని...ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఛానెల్ కార్యక్రమాలన్నీ కూడా గ్రూప్ ఎడిటర్ నావికా కుమార్ ఆధ్వర్యంలో జరుగుతాయని..ఆపరేటింగ్ కంటెంట్ అంతాకూడా మేనేజర్ లు నావికా కుమార్ కు రిపోర్టు చేయాల్సిందిగా పంపించింది. న్యూస్ ఎక్స్ ఎడిటర్ గా పదవికి రాజీనామా చేసిన శిశశంకర్ 2016లో టైమ్స్ నౌ లో చేరారు. టైమ్స్ నౌన్ 8 పీఎం ప్రైమ్ టైమ్ షోను హో చేస్తూ చాలా పాపులర్ అయ్యారు. మీడియాలో 20ఏళ్లకుపైగా అనుభవం ఉన్న జర్నలిస్టు శివశంకర్. హెడ్ లైన్స్ టుడే, ఇండియా టుడేలలో కూడా ఆయన పనిచేశారు. వారిద్దరి మధ్య పోటీ కారణంగానే? ప్రస్తుతం ఇంచార్జీగా నియమితులైన నావికాకుమార్, శివశంకర్ మధ్య తీవ్రమైన పోటీ వల్ల న్యూస్ రూంపై తీవ్ర ప్రభావం పడింది. చానెల్ లోని జర్నలిస్టులు రెండు గ్రూపులుగా విడిపోయారు. అయితే నావికా కుమార్ హిందీ ఛానల్ పై దృష్టి పెట్టడంతో శివశంకర్ కు తాత్కలికంగా ఉపశమనం లభించింది. అయినా కూడా టైమ్స్ లో నావికాకుమార్ ఆధిపత్యం కొనసాగడంతోనే శివశంకర్ టైమ్స్ నుంచి వైదొలిగినట్లు వార్తలు వస్తున్నాయి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి