/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/chicken-1-1-jpg.webp)
Meat Shops Will Be Closed On Sunday: హైదరాబాద్‌లోని మాంసం ప్రియులకు చేదు వార్త. ఈ ఆదివారం నాడు నగరంలోని అన్ని చికెన్, మటన్ షాపులు మూతపడనున్నాయి. ఆదివారం మహావీర్ జయంతి కావడంతో.. జైనులు జరుపుకునే అతి ముఖ్యమైన పండగ కాబట్టి.. అన్ని మాంసం షాపులు మూసివేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవల ట్రిపుల్ సెంచరీ నమోదు..
చికెన్ ప్రియులకు ధరలు రోజురోజుకి షాక్ ఇస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వారం క్రితం వరకు కూడా కిలో చికెన్ రూ. 200 నుంచి రూ. 240 వరకు ఉంటే.. ఈ ఆదివారం చికెన్ ధర ఒక్కసారిగా రూ. 300 కు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే రూ. 320 నుంచి 350 వరకు కూడా విక్రయిస్తున్నారు. లైవ్ కోడి ధరలు అయితే రూ. 250 వరకు, నాటుకోళ్లు అయితే రూ. 500 వరకు పలుకుతున్నాయి.
చికెన్ ధరలే ఇలా ఉన్నాయంటే.. గుడ్ల ధర గురించి ప్రత్యేకంగా చెప్పాక్కర్లేదు. దీంతో చికెన్ కాకపోయినా కనీసం గుడ్డు అన్న తిందామనుకునే వారికి నోటికి ఆ గుడ్డే అడ్డుపడేట్లుంది. వచ్చే రెండు నెలలు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. రానున్న రోజుల్లో చికెన్ ధర రూ. 350 వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎండ వేడి ఎక్కువగా ఉండడంతో కోళ్లు చనిపోవడంతో వాటి ఉత్పత్తి తగ్గిందని.. దీనికి తోడు దాణా రేట్లు కూడా భారీగా పెరగడంతో చికెన్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.