కోడి కత్తి కేసు విశాఖపట్నం NIA కోర్టుకు బదిలీ..ఆగష్టు 8 కి వాయిదా!

కోడికత్తి కేసును ఎన్ఐఏ కోర్టు ఆగష్టు 8 కి వాయిదా వేసింది. అదే విధంగా ఈ కేసును విశాఖపట్నం NIA కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిందితుడు శ్రీను తరపున వాదిస్తున్న న్యాయవాది కేసులో 80 శాతం వాదనలు పూర్తైన తరువాత మరో ప్రాంతానికి బదిలీ చేయడం దారుణమని.. ఈ కేసును తేలిగ్గా వదిలేసేదే లేదని.. ఎక్కడైనా మా వాదనలు పూర్తిస్థాయిలో వినిపిస్తామన్నారు.

New Update
కోడి కత్తి కేసు విశాఖపట్నం NIA కోర్టుకు బదిలీ..ఆగష్టు 8 కి వాయిదా!

కోడికత్తి కేసును ఎన్ఐఏ కోర్టు ఆగష్టు 8 కి వాయిదా వేసింది. అదే విధంగా ఈ కేసును విశాఖపట్నం NIA కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిందితుడు శ్రీను తరపున వాదిస్తున్న న్యాయవాది గగన సింధు కేసులో 80 శాతం వాదనలు పూర్తైన తరువాత మరో ప్రాంతానికి బదిలీ చేయడం దారుణమన్నారు. ఈ కేసును తేలిగ్గా వదిలేసేదే లేదని.. ఎక్కడైనా మా వాదనలు పూర్తిస్థాయిలో వినిపిస్తామన్నారు.

ఇక కేసు కొలిక్కి రావాలంటే కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, విశాఖపట్నంలో సీఎం జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన కేసు అనేక మలుపులు తీసుకుంటూనే ఉంది. తాజాగా ఈ దాడి కేసులో కుట్ర కోణంపై లోతుగా దర్యాప్తు చేయాలని వైఎస్ జగన్ తరుపు లాయర్ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అయితే ఈ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. అంతేకాకుండా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ వేసిన పిటిషన్ పై ఆగష్టు 1న విచారణ జరుపుతామని కోర్టు తెలియజేసింది.

దాడి చేసిన నిందితుడు 4 ఏళ్లుగా జైల్లోనే ఉన్న కారణంగా అతనికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను కూడా ఈ రోజే విచారిస్తామని కోర్టు తెలిపింది.అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ రాజమహేంద్రవరం జైల్లో ఉన్నాడు.విజయవాడ ఎన్ఐఏ కోర్టుకి తరుచుగా విచారణకు హాజరు పర్చడం ఇబ్బందిగా మారిందని నిందితుడి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై న్యాయమూర్తి జైల్ సూపరింటెండ్ ను వివరణ అడిగారు. దీనికి సమాధానంగా.. రాజమహేంద్రవరం జైలులో రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా ఎన్ఐఏ కేసులో రిమాండ్ లో ఉన్న ఖైదీని జైలు నుంచి విచారించడం సాధ్యం కాదన్నారు. దీంతో ఈ కేసును విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేస్తూ విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది.

అయితే ప్రధాని నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ రావు చెప్పిన విషయాలను ఎన్ఐఏ రికార్డు చేసింది. చార్జ్ షీట్ , కౌంటర్ తోపాటు ఈ స్టేట్ మెంట్ ను ఎన్ఐఏ జతచేసింది. ఇందులో శ్రీనివాస్ రావు కీలక విషయాలను పేర్కొన్నాడు. తాను మొదటి నుంచి వైఎస్సార్ అభిమానిని అని.. జగన్ అధికారంలోకి రావాలని కోరుకున్నానని పేర్కొన్నాడు. అయితే ప్రజల్లో సానుభూతి కోసం మాత్రమే..జగన్ పై ఎటాక్ చేశానని తెలిపాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు