Chhattisgarh High Court: చిన్న చిన్న కారణాలకే గొడవలు ముదురుతూ విడాకుల దాకా తెచ్చుకుంటున్న జంటలను చూస్తున్నాం. ఇలాంటి కేసే ఒకటి ఛత్తిస్గఢ్ హైకోర్టుకు వచ్చింది. అయితే, ఆ కారణంతో విడాకులివ్వలేం పొమ్మంటూ న్యాయస్థానం ఆ వ్యక్తి పిటిషన్ ను కొట్టేసింది. ఇంతకీ విషయమేంటంటే.. తన భార్య నల్లగా ఉందన్న కారణంతో విడాకులు ఇప్పించాలని కోరుతూ హై కోర్టు మెట్లెక్కాడు.
ఇది కూడా చదవండి: PV Sindhu: ఆటలో అంతంతే.. సంపాదనలో తగ్గేదే లే!
పిటిషన్ ను విచారించిన హై కోర్టు ఆ ప్రబుద్ధుడిని చీవాట్లు పెడుతూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. ఫ్యామిలీ కోర్టు ఏం చెప్పిందంటారా.. రంగు నచ్చకుంటే విడాకులివ్వరమ్మా..! అంటూ హితబోధ చేసింది. వారికి పెళ్లైంది కూడా 2005లో. అయితే, తన భార్య తనను వదిలిపెట్టి వెళ్లిపోయిందంటూ భర్త వాదించాడు. కానీ, తాను నల్లగా ఉన్న కారణంగానే భర్త వేధించి ఇంటి నుంచి గెంటేశాడని భార్య గోడు వెల్లబోసుకుంది. చివరికి పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.
ఇది కూడా చదవండి: రాంగోపాల్ వర్మకు బిగ్ షాక్.. వ్యూహం సినిమాకు చెక్ పెట్టిన కోర్టు
చర్మం రంగు ఆధారంగా వివక్ష అవాంఛనీయమని ఈ కేసు సందర్భంగా జస్టిస్ గౌతమ్ భాదురి, జస్టిస్ దీపక్ కుమార్ తివారీతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. పెళ్లి సమయంలో భాగస్వాముల ఎంపిక కోసం చర్మం రంగు ప్రాధాన్యం, ఫెయిర్నెస్ క్రీములపై జరిగిన పలు నిశితమైన అధ్యయనాలను న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ విషయంలో సమాజం ఆలోచన ధోరణి కూడా మారాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఈ అంశాల ద్వారా ఈ కేసును కేవలం ఒక జంటకు సంబంధించిన అంశంగా కాకుండా, ఒక సామాజిక అంశంగా న్యాయస్థానం భావించినట్లు స్పష్టమవుతోంది.