TS Politics: బీజేపీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి కొండా?

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పై బీజేపీ పెద్దలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

New Update
TS Politics: బీజేపీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి కొండా?

తెలంగాణ బీజేపీకి (Telangana BJP) మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (Konda Vishveshwar Reddy) కూడా ఆ పార్టీని వీడేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై కొండా కొంత కాలంగా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీంతో పాటు ఇటీవల పార్టీలోని పలువురు సీనియర్ నేతలతో విశ్వేశ్వర్ రెడ్డికి విభేదాలు తలెత్తాయి. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో పలు అసెంబ్లీ టికెట్లపై లక్ష్మణ్ వేలు పెడుతున్నారని విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: TS BJP: నేను పోటీ చేయను.. తెలంగాణ బీజేపీకి మరో కీలక నేత షాక్!

ముఖ్యంగా తన పార్లమెంట్ పరిధిలోని పరిగి, శేరిలింగంపల్లిలో కొండా వర్గీయులకు కాకుండా.. తన వారికి టికెట్ ఇప్పించుకోవాలని లక్ష్మణ్ ప్రయత్నిస్తున్నారు. దీంతో కొండా అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి, అగ్రనేత రాహుల్ గాంధీతోనూ విశ్వేశ్వర్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు