బీఆర్‌ఎస్‌కు షాక్! మరోసారి జంప్ అయిన మాజీ ఎమ్మెల్యే.. ఈసారి వారు కూడా..

నల్లాల ఓదేలు బీఆర్‌ఎస్ పార్టీని వీడటం ఇది రెండవసారి. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓదేలుకు టికెట్ నిరాకరించారు కేసీఆర్. దాంతో ఆయన అప్పటి టీఆర్‌ఎస్ పార్టీని వీడి.. కాంగ్రెస్‌లో చేరారు. అయితే, మధ్యలో మళ్లీ ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

New Update
బీఆర్‌ఎస్‌కు షాక్! మరోసారి జంప్ అయిన మాజీ ఎమ్మెల్యే.. ఈసారి వారు కూడా..

Nallala Odelu Joined in Congress: బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు(Nallala Odelu).. ఇవాళ బీఆర్ఎస్‌(BRS) పార్టీని వీడారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో మరోసారి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఓదేలాఉ భార్య భాగ్యలక్ష్మి ప్రస్తుతం మంచిర్యాల జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఈసారి చెన్నూరు ఎమ్మెల్యే టికెట్ ఆశించగా.. గులాబీ బాస్ కరుణించకపోవడంతో ఆయన బీఆర్‌ఎస్‌ని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మంచిర్యాల జెడ్పీచైర్ పర్సన్‌గా ఉన్న తన భార్య భాగ్యలక్ష్మితో పాటు కాంగ్రెస్‌లో చేరారు. కాగా ఓదేలుతో పాటు.. పలువురు బీఆర్‌ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. కాగా, ఓదేలు, ఆయన భార్య, అనుచరులకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి.

కాగా, నల్లాల ఓదేలు బీఆర్‌ఎస్ పార్టీని వీడటం ఇది రెండవసారి. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓదేలుకు టికెట్ నిరాకరించారు కేసీఆర్. దాంతో ఆయన అప్పటి టీఆర్‌ఎస్ పార్టీని వీడి.. కాంగ్రెస్‌లో చేరారు. అయితే, మధ్యలో మళ్లీ ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు కూడా టికెట్ దక్కకపోవడంతో.. మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు ఓదేలు.

తెలంగాణ నుంచే యుద్ధం మొదలు అంటున్న కాంగ్రెస్ నేతలు..

కాంగ్రెస్ లో చేరనున్న మైనంపల్లి హనుమంతరావు..

Also Read:

Telangana: మరో కీలక పథకం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. విద్యార్థులకు ఇక నుంచి..

Telangana: విశ్వకర్మ యోజనతో రూ. 3 లక్షల రుణం.. కీలక వివరాలు వెల్లడించిన ఎంపీ లక్ష్మణ్..

Advertisment
తాజా కథనాలు