Ponguleti Son : పొంగులేటి కుమారుడికి కస్టమ్స్ సమన్లు.. అసలేమైందంటే?

గడియారాల స్మగ్లింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షరెడ్డికి కస్టమ్స్ అధికారులు సమన్లు జారీ చేశారు. అయితే.. ఈ కేసుతో తనకు సంబంధం లేదని హర్షరెడ్డి చెబుతున్నారు.

New Update
Ponguleti Son : పొంగులేటి కుమారుడికి కస్టమ్స్ సమన్లు.. అసలేమైందంటే?

Customs Notice To Ponguleti Srinivasa Reddy Son : తెలంగాణ మంత్రి, కాంగ్రెస్(Congress) కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) కుమారుడు హర్షరెడ్డి(Harsha Reddy) కి చెన్నై కస్టమ్స్ అధికారులు సమన్లు జారీ చేశారు. గడియారాల స్మగ్లింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై నోటీసులు పంపించారు. ఈ నెల 4న హాజరు కావాలని ఆయనకు నోటీసులు పంపించగా.. ఈ నెల 3న కస్టమ్స్ కు పొంగులేటి కుమారుడు లేఖ రాశారు. తాను డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు హర్షరెడ్డి. ఈ నెల 27 తర్వాత విచారణకు వస్తానని వెల్లడించారు.

ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. సింగపూర్‌(Singapore) నుంచి చెన్నై(Chennai) కి లగ్జరీ వాచ్‌లను ఫహెర్దీన్ ముబీన్‌ అనే వ్యక్తి తీసుకొచ్చాడని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. మధ్యవర్తి నవీన్‌కుమార్‌ ద్వారా ముబీన్‌ నుంచి వాచీలను హర్షరెడ్డి కొనుగోలు చేసినట్లు గుర్తించామని కస్టమ్స్ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే.. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పొంగులేటి హర్షరెడ్డి చెబుతున్నారు. కస్టమ్ అధికారుల వాదనలో వాస్తవం లేదని స్పష్టం చేస్తున్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఖమ్మం ఎంపీ టికెట్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుమారుడికి కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇవ్వడం ఆయనకు కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీలోనే ఆయనంటే పడని వారు ఈ అంశాన్ని అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉంది.

Also Read : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన మరో ఎమ్మెల్యే!

Advertisment
తాజా కథనాలు