TG Minister Ponguleti: మంత్రి పొంగులేటికి కస్టమ్స్ అధికారుల షాక్

వాచీల స్మగ్లింగ్‌ కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు నివాసంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. దాదాపు 6 గంటల పాటు తనిఖీలు చేశారు. శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్ష రెడ్డి రూ.1.7 కోట్లు విలువగల వాచీల స్మగ్లింగ్‌ కేసులో గతంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే.

TG Minister Ponguleti: మంత్రి పొంగులేటికి కస్టమ్స్ అధికారుల షాక్
New Update

వాచీల స్మగ్లింగ్‌ కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు నివాసంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. దాదాపు 6 గంటల పాటు ఆయన నివాసంలో తనిఖీలు చేశారు. శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్ష రెడ్డి రూ.1.7 కోట్లు విలువగల వాచీల స్మగ్లింగ్‌ కేసులో గతంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది ఫిబ్రవరి 5న చెన్నై ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు రెండు అత్యంత ఖరీదైన వాచీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాచీలను మహమ్మద్‌ ఫహెర్దీన్‌ ముబీన్‌ అనే వ్యక్తి హాంకాంగ్‌ నుంచి సింగపూర్‌ మీదుగా భారత్‌లోకి తీసుకొచ్చినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

ఈ వాచీలను పాటెక్‌ ఫిలిప్‌ 5740, బ్రెగ్యుట్‌ 2759గా గుర్తించారు. కాగా.. మన దేశంలో పాటెక్‌ ఫిలిప్‌ వాచ్‌ కు సంబంధించి డీలర్లు లేరు. బ్రెగ్యుట్‌ కంపెనీకు సంబంధించిన వాచీలు మన మార్కెట్‌లో స్టాక్‌ లేవు. దీంతో అనుమానం వచ్చిన కస్టమ్స్‌ అధికారులు ఆ వాచీలను పరిశీలించగా.. వాటి ధర రూ.1.70 కోట్లపైగా ఉందని గుర్తించి షాక్ అయ్యారు. దీంతో ఆ వాచీలను తీసుకువచ్చిన ముబీన్‌ను అరెస్టు చేసి విచారణ చేపట్టగా నవీన్ కుమార్ అనే వ్యక్తి కోసం తీసుకువచ్చినట్లు చెప్పాడు.

దీంతో నవీన్ కుమార్ ను విచారణ చేయగా.. అతను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షా రెడ్డి పేరు చెప్పాడు. హర్షారెడ్డి కోసం నవీన్ కుమార్ మధ్యవర్తిగా ఈ వాచీలను తెప్పిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హవాలా మార్గంలో ఇందుకు డబ్బులు చెల్లించినట్లు కస్టమ్స్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో హర్షారెడ్డి నివాసంలో ఈ రోజు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe