Gas Leak: స్కూల్లో కెమికల్ లీక్.. 24 మంది విద్యార్థులకు అస్వస్థత

ఏపీలో మరో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. బాపట్ల కేంద్రీయ విద్యాలయంలోని సైన్స్ ల్యాబ్ లో కెమికల్ గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన యాజమాన్యం విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Gas Leak: స్కూల్లో కెమికల్ లీక్.. 24 మంది విద్యార్థులకు అస్వస్థత
New Update

AP Gas Leak: ఏపీలో మరో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. బాపట్ల కేంద్రీయ విద్యాలయంలోని సైన్స్ ల్యాబ్ లో కెమికల్ గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన యాజమాన్యం విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఆరో తరగతి విద్యార్థిని కొన్ని పదార్థాల మిశ్రమాన్ని తీసుకొచ్చి పిల్లలందరికి వాసన చూపించడంతో అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

నిన్న అనకాపల్లి జిల్లాలో ప్రమాదం..

అచ్యుతాపురం పేలుడు ఘటన మరువకముందే ఏపీలో మరో రియాక్టర్ పేలింది. అనకాపల్లి జిల్లా ఫార్మా సెజ్ లో మరో ప్రమాదం జరిగింది. సినర్జిన్ యాక్టివ్ సంస్థలో అర్థరాత్రి 12:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఒకరి పరిస్థితి విషమం, మరో నలుగురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. విశాఖ ఇండస్ ఆస్పత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు ఆ జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు,క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు. తక్షణమే బాధితులతో మాట్లాడాలని హోంమంత్రి అనితకు ఆదేశించారు. అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ సేవలను ఉపయోగించాలని అన్నారు. 

#gas-leak-in-ap #bapatla-gas-leak
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe