Gas Leak: స్కూల్లో కెమికల్ లీక్.. 24 మంది విద్యార్థులకు అస్వస్థత ఏపీలో మరో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. బాపట్ల కేంద్రీయ విద్యాలయంలోని సైన్స్ ల్యాబ్ లో కెమికల్ గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన యాజమాన్యం విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. By V.J Reddy 24 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి AP Gas Leak: ఏపీలో మరో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. బాపట్ల కేంద్రీయ విద్యాలయంలోని సైన్స్ ల్యాబ్ లో కెమికల్ గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన యాజమాన్యం విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఆరో తరగతి విద్యార్థిని కొన్ని పదార్థాల మిశ్రమాన్ని తీసుకొచ్చి పిల్లలందరికి వాసన చూపించడంతో అస్వస్థతకు గురైనట్లు సమాచారం. https://rtvlive.com/wp-content/uploads/2024/08/WhatsApp-Video-2024-08-24-at-2.58.56-PM.mp4"> నిన్న అనకాపల్లి జిల్లాలో ప్రమాదం.. అచ్యుతాపురం పేలుడు ఘటన మరువకముందే ఏపీలో మరో రియాక్టర్ పేలింది. అనకాపల్లి జిల్లా ఫార్మా సెజ్ లో మరో ప్రమాదం జరిగింది. సినర్జిన్ యాక్టివ్ సంస్థలో అర్థరాత్రి 12:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఒకరి పరిస్థితి విషమం, మరో నలుగురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. విశాఖ ఇండస్ ఆస్పత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు ఆ జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు,క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు. తక్షణమే బాధితులతో మాట్లాడాలని హోంమంత్రి అనితకు ఆదేశించారు. అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ సేవలను ఉపయోగించాలని అన్నారు. #bapatla-gas-leak #gas-leak-in-ap మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి