Breaking: నంద్యాల జిల్లాలో చిరుత పులి దాడి కలకలం సృష్టిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. తాజాగా, గిద్దలూరు ఘాట్ రోడ్డు లోని పచర్లలో అటవీ శివారులో చిరుత పులి దాడి ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. చిరుత దాడిలో ఓ మహిళ దారుణంగా బలైయింది.
Also Read: జగన్ బొమ్మ తీసేస్తా.. కుప్పంకు విమానాశ్రయం తెస్తా.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!
వివరాల్లోకి వెళ్తే.. మాజీ సర్పంచ్ షేక్ మెహరున్నిసా అనే మహిళ అడవీలో కట్టెల కోసం వంక వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమెపై చిరుత పులి దాడి చేసింది. షేక్ మెహరున్నిసా కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు వంక వద్దకు వెళ్లారు. అయితే, ఇలోపే చిరుత మహిళను చంపి మొండెంను ఎత్తుకుపోయింది.
Also Read: ఖమ్మం జిల్లాలో విషాదం.. తల్లీ, కొడుకు మృతి..!
స్థానికులు వెళ్ళేసరికి షేక్ మెహరున్నిసా మొండెం కనిపించలేదు. కాగా, నాలుగు రోజుల క్రితం కూలీ షేక్ బీబీపై కూడా దాడి చేసి చిరుత గాయపరిచినట్లు తెలుస్తోంది. అలర్ట్ అయిన అటవీ అధికారులు చిరుతను పట్టుకోవడానికి 10 కెమెరాలు , 2 బొన్లను ఏర్పాటు చేశారు.