పసికూన చేతిలో ఓడిన బంగ్లాదేశ్..

పసికూనగా క్రికెట్ లో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ సంచలన ప్రదర్శనలు చేస్తూ బలమైన టీమ్ గా మారింది. బలమైన టీంలను ఓడిస్తూ అంచెలెంచలుగా ఎదిగింది.అయితే అదంతా ఒకప్పటి మాట ఇప్పుడు అంతా తలకిందులైంది.పసికూనల చేతిలో ఓటమి పాలవుతుంది.

పసికూన చేతిలో ఓడిన బంగ్లాదేశ్..
New Update

ఈ మధ్య  కాలంలో వారి ఆటతీరు దారుణంగా మారిపోయింది. చిన్న చిన్న దేశాల చేతిలో ఓడిపోతూ వస్తుంది. తాజాగా బంగ్లాదేశ్ కు ఘోర పరాభవం ఎదురైంది. క్రికెట్ లో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న పసికూన చేతిలో దారుణంగా ఓడింది.  అమెరికా ప్రపంచంలోనే అగ్రదేశంగా ఉన్నా క్రికెట్ లో మాత్రం పసికూన. తాజాగా అమెరికా జట్టు పెను సంచలనం సృష్టించింది. బంగ్లాదేశ్ తో జరిగిన టి20 పోరులో 5 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది.

మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా జరిగిన తొలి టి20 పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. హ్రుదోయ్ (47 బంతుల్లో 58; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో మెరిశాడు. మహ్ముదుల్లా (22 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. స్టీవెన్ టేలర్ 2 వికెట్లతో మెరిశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో అమెరికా 19.3 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే నష్టపోయి 156 పరుగులు చేసి నెగ్గింది.

కోరీ ఆండర్సన్ (25 బంతుల్లో 34 నాటౌట్; 2 సిక్సర్లు), హర్మీత్ సింగ్ (13 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ధనాధన్ షాట్లతో రెచ్చిపోయాడు.ఇక ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ప్రధాన జట్టుతోనే బరిలోకి దిగింది. వచ్చే నెల నుంచి అమెరికా, కరీబియన్ దీవుల్లో టి20 ప్రపంచకప్ జరగనుంది. దాంతో మెగా టోర్నీకి సన్నాహకాల్లో భాగంగా బంగ్లాదేశ్ అమెరికాతో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడుతోంది. సీనియర్ ప్లేయర్ షకీబుల్ హసన్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో దారుణంగా విఫలం అయ్యాడు. తొలి టి20లో నెగ్గిన అమెరికా.. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

#usa #america #bangladesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe