Pakistani Man Arrested: హైదరాబాద్‌లో పాకిస్తానీ అరెస్ట్‌ కేసులో కొత్త కోణం

హైదరాబాద్‌లో పాకిస్తాన్ వ్యక్తి అరెస్ట్‌ కేసులో కొత్త కోణం బయటపడింది. భార్య కోసం నేపాల్‌ మీదుగా వీసా లేకుండా హైదరాబాద్‌కు వచ్చినట్టు గుర్తించారు పోలీసులు. పాకిస్తాన్‌కు చెందిన మహమ్మద్‌ ఫయాజ్‌..భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. ఒకటి, రెండు కాదు..దాదాపు ఏడాది కాలంగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. అయితే భార్య కోసమే అతను పాకిస్తాన్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.

New Update
Pakistani Man Arrested: హైదరాబాద్‌లో పాకిస్తానీ అరెస్ట్‌ కేసులో కొత్త కోణం

హైదరాబాద్‌లో పాకిస్తాన్ వ్యక్తి అరెస్ట్‌ కేసులో కొత్త కోణం బయటపడింది. భార్య కోసం నేపాల్‌ మీదుగా వీసా లేకుండా హైదరాబాద్‌కు వచ్చినట్టు గుర్తించారు పోలీసులు. పాకిస్తాన్‌కు చెందిన మహమ్మద్‌ ఫయాజ్‌..భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. ఒకటి, రెండు కాదు..దాదాపు ఏడాది కాలంగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. ఐతే భార్య కోసమే అతను పాకిస్తాన్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడే సెటిల్ అవ్వాలని నిర్ణయించుకొని..మరో వ్యక్తి పేరుపై ఆధార్ కార్డు పొందేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు దొరికిపోయాడు. అతనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు పోలీసులు.

పాకిస్తాన్‌ ఖైబర్‌ పఖ్తూంఖ్వాకు చెందిన ఫయాజ్‌ మహ్మద్‌ ఉపాధి కోసం 2018 డిసెంబర్‌లో దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ ఓ పరిశ్రమలో పనికి కుదిరాడు. ఇటు హైదరాబాద్‌ బహదూర్‌పురా ఠాణా పరిధిలోని కిషన్‌బాగ్‌కు చెందిన నేహా ఫాతిమా కూడా.. 2019లో దుబాయ్‌ వెళ్లింది. అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా ఆమెకు సాయం చేశాడు ఫయాజ్. తను పని చేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం ఇప్పించాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి 2019లోనే ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వారికి ఓ బాబు కూడా ఉన్నాడు.

ఫాతిమా గతేడాది కొడుకును తీసుకొని హైదరాబాద్‌కు వచ్చి కిషన్‌బాగ్‌లోని అసఫ్‌ బాబానగర్‌లో ఉంటోంది. ఫయాజ్‌ పాకిస్తాన్‌కు వెళ్లిపోయాడు. అయితే ఫయాజ్‌ను హైదరాబాద్‌ రావాలని కోరారు ఫాతిమా తల్లిదండ్రులు జుబేర్‌ షేక్‌, అఫ్జల్‌ బేగం. ఐడీ కార్డ్స్‌ సంగతి తాము చూసుకుంటామని చెప్పారు. దీంతో వీసా, ఎలాంటి గుర్తింపు లేకున్నా ఫయాజ్‌ 2022 నవంబర్‌లో నేపాల్‌కు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన ఫాతిమా తల్లిదండ్రులు అతన్ని వీసా లేకుండానే హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఫయాజ్ ఏడాది కాలంగా కిషన్‌బాగ్‌లో ఉంటున్నాడు.

ఈ క్రమంలో ఫయాజ్‌కు ఎలాగైనా గుర్తింపు పత్రాలు సాధించాలని జుబేర్ షేక్, అఫ్జల్ బేగం ప్లాన్ చేశారు. మరో వ్యక్తి పేరిట ఆధార్‌ తీసుకునేందుకు..ఫేక్‌ బర్త్‌ సర్టిఫికెట్‌ సబ్‌మిట్‌ చేశారు. అనుమానం వచ్చిన ఆధార్‌ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఫయాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న అత్తమామలు షేక్‌ జుబేర్, అఫ్జల్ బేగంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫయాజ్‌ పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు