VaralakshmiVratham2023 : వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసం ఈ మంత్రాలను పఠించండి..!

రేపు (ఆగస్టు 25)శుక్రవారం వరలక్ష్మీవ్రతం జరుపుకోనున్నారు. ఈ పర్వదినాన లక్ష్మీదేవిపూజతో పాటు లక్ష్మీదేవి మంత్రాలను పఠించడం అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. వరలక్ష్మీవ్రతం రోజు ఏ మంత్రాలు చదవాలి...?

New Update
VaralakshmiVratham2023 : వరలక్ష్మి అమ్మవారి  అనుగ్రహం కోసం ఈ  మంత్రాలను పఠించండి..!

VaralakshmiVratham2023 : శ్రావణ మాసంలోని రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని (VaralakshmiVratham) ఆచరిస్తారు. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సు, అదృష్టానికి సంకేతం. వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడం వల్ల అన్ని రకాల కోరికలు నెరవేరుతాయని మహిళలు నమ్ముతుంటారు. వివాహిత స్త్రీలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సంతానం పొందుతారు. ఈ రోజున మనం పఠించే లక్ష్మీ మంత్రం మన జీవితంలో శ్రేయస్సు, అదృష్టాన్ని తెస్తుంది. వరలక్ష్మీవ్రతం  (VaralakshmiVratham)రోజు ఏ మంత్రాన్ని పఠించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పాపాత్మానం కృత్ధియా< హృదదేషు బుద్ధిః|| శ్రద్ధా సతాం కులజనప్రభవస్య లజ్జ| తం త్వం నతః స్మ పరిపాలయ దేవి విశ్వమ్||

2. విష్ణుప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం జగద్దతే అర్థ హంత్రీ నమస్తుభ్యం సమృద్ధం కురు మే సదా నమో నమస్తే మహం మాయ శ్రీ పీఠే సుర పూజతే శంఖ చక్ర గదా హస్తే మహం లక్ష్మీ నమోస్తుతే||

3. ఓం శ్రీ మహాలక్ష్మై చ విద్మహే
విష్ణు పత్నాయ చ ధీమహి
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ||

4. ఓం హ్రీం శ్రీ క్రీమ్ క్లీం శ్రీ లక్ష్మీ మమ
గృహే ధన్ పూరే, ధన్ పూరే
చింతయేం ధుర్యే ధుర్యే స్వాహా||

5. పద్మ సంభవే తన్మే భజసి పద్మాక్షి
యేన సౌఖ్యం లభామ్యహమ్||

6. ఓం సర్వబాధ వినిర్ముక్తో దంధాన్యః సుతాన్విత
మాంసినో మత్ప్రసాదేన్ న ధాకవాన్ ఓం ||

పైన పేర్కొన్న లక్ష్మీదేవి మంత్రాలు కాకుండా వరలక్ష్మి పండుగ రోజున ఏదైనా లక్ష్మీదేవి (goddess lakshmi) మంత్రాన్ని పఠించవచ్చు. లక్ష్మీ దేవిని మంత్రాలతో పూజించడం వల్ల పూజ ఫలితాలు రెట్టింపు అవుతాయి. మీరు కూడా ఈ వరలక్ష్మీదేవి వ్రతం రోజున  పై లక్ష్మీ మంత్రాలను పఠించి అమ్మవారి అనుగ్రహం పొందండి.

Advertisment
తాజా కథనాలు