Chandrayaan 3 updates : ఇదిరా ఇస్రో అంటే.. 100కు 100శాతం సక్సెస్ రేట్‌తో చంద్రయాన్-3 ప్రయోగం విజయాల పరంపరను కొనసాగిస్తోంది. ల్యాండర్, రోవర్ తమ పనిని అద్భుతంగా చేసుకుపోతున్నాయి. ఏ టైమ్‌కి ఏం చేయాలో అదే చేస్తూ ఇస్రో సైంటిస్టుల ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. అదే సమయంలో దేశ ప్రజలు హృదయాలను కొల్లగొడుతోంది. చంద్రయాన్-3 ప్రయోగంపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని ట్వీట్టర్ ద్వారా పంచుకుంటోంది ఇస్రో. తాజాగా మరో ట్వీట్ చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది.
ప్రయోగంపై ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తున్న ఇస్రో తాజాగా మిషన్ లక్ష్యాలపై ఓ ట్వీట్ వేసింది. అది కాస్త క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది. మొత్తం మూడు టార్గెట్లతో ఇప్పటికే రెండు టార్గెట్లు ఫినిష్ చేసినట్టు ఇస్రో ట్వీట్ చేసింది. మరొక మిషన్‌ని పూర్తి చేసేందుకు సిద్ధమంది.
మొత్తం మూడు లక్ష్యాల్లో:
➼ జాబిల్లి ఉపరితలంపై సురక్షితమైన, సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ ☑️
➼ చంద్రునిపై తిరిగే రోవర్ ప్రదర్శన సక్సెస్ ☑️
➼ 'in-situ' సైంటిఫిక్ ప్రయోగం కొనసాగుతోంది. అన్ని పేలోడ్‌లు సాధారణంగా పని చేస్తున్నాయి
వీడియో వైరల్:
అంతకముందు చంద్రయాన్-3కి సంబంధించిన మరో వీడియో రిలీజ్ వైరల్‌గా మారింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతున్న వీడియోను ఇస్రో పోస్ట్ చేసింది.రహస్యాలు తెలుసుకునేందుకు చంద్రుడి చుట్టూ రోవర్ తిరుగుతోంది. శివశక్తి పాయింట్‌లో ఫొటోలు తీసి పంపుతోంది రోవర్. ల్యాండర్ ద్వారా బెంగళూరు ఇస్రో హెడ్‌క్వార్టర్స్‌కు చంద్రుడి రహస్యాలు అందుతున్నాయి. 40 సెకన్ల లేటెస్ట్ వీడియోను ఇస్రో రిలీజ్ చేయగా.. అది చూసి నెటిజన్లు ఆనంద పడుతున్నారు. ఇప్పటికే ల్యాండర్ నుంచి రోవర్ విడిపోయిన వీడియో విడుదల చేసింది ఇస్రో. చంద్రయాన్-3 చంద్రుడిపై దిగి 4రోజులు అయ్యింది.. మరో 10 రోజులు మాత్రమే చంద్రయాన్-3 మిషన్ పనిచేసే ఛాన్స్ ఉంది. ఇక ఎప్పటికప్పుడు రోవర్ ఇస్తున్న సమాచారాన్ని ల్యాండర్ పంపిస్తోంది.
మోదీ భావోద్వేగం:
ఇక చంద్రయాన్-3 ద్వారా అసాధారణ విజయం నమోదు చేశామన్న ప్రధాని..ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నట్టు భావోద్వేగానికి గురయ్యారు. చంద్రయాన్ - 3 సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్నా. నా మనసంతా చంద్రయాన్ - 3 విజయంపైనే ఉంది. మిమ్మల్ని కలవడానికి ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశానన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు నేరుగా బెంగుళూరుకొచ్చానని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు భారత్ చంద్రుడిపై ఉంది. ఇంటింటిపైనే కాదు. చంద్రునిపై కూడా మన మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోందన్నారు. ఇప్పటివరకూ ఏ దేశం చేయలేనిది చేసి..ప్రపంచానికి మన సత్తా చాటామన్నారు. చంద్రయాన్-3 ల్యాండైన ప్రాంతానికి శివశక్తి పాయింట్‌గా నామకరణం చేస్తున్నామని ప్రకటించారు. అలాగే చంద్రయాన్-2 దిగిన ప్రదేశానికి తిరంగా పాయింట్‌గా పేరు పెడుతున్నట్టు తెలిపారు. చంద్రయాన్-3 సక్సెస్‌లోమహిళా సైంటిస్టుల పాత్ర ఎంతో ఉందన్న ప్రధాని..దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చారని సంతోషం వ్యక్తం చేశారు. '' చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగుపెట్టిన ఆగస్టు 23ను మనం నేషనల్ స్పేస్ డేగా జరుపుకుందామన్నారు.
ALSO READ: శివశక్తి పాయింట్ చుట్టూ తిరుగుతున్న రోవర్.. కొత్త వీడియోలను రిలీజ్ చేసిన ఇస్రో!