Chandrayaan-3: జాబిల్లిపై చిమ్మ చీకటి.. శాశ్వత నిద్రలోకి చంద్రయాన్‌.. రోవర్‌, ల్యాండర్ ఏం చేస్తాయి?

సూర్యుడు మరోసారి చంద్రుడిపై అస్తమించాడు. చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు 14 భూమి రోజులకు సమానమైన చంద్రుడి రోజున మేల్కొనలేదు. అంటే భారత్ మిషన్ ముగిసినట్టేనన్న వాదన వినిపిస్తోంది. చంద్రయాన్-3లోని ప్రజ్ఞాన్, విక్రమ్ ద్వయం మేల్కొనకపోతే, అది ఎప్పటికీ భారత లూనార్ అంబాసిడర్‌గా అక్కడే ఉంటుందని ఇస్రో ఇదివరకే తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై కొన్ని ప్రయోగాలను పునరావృతం చేయడానికి ఇది ఒక అవకాశం. కానీ విక్రమ్, ప్రజ్ఞాన్ స్పందించలేదు.

Chandrayaan-3: జాబిల్లిపై చిమ్మ చీకటి.. శాశ్వత నిద్రలోకి చంద్రయాన్‌.. రోవర్‌, ల్యాండర్ ఏం చేస్తాయి?
New Update

chandrayaan 3 updates: చంద్రుడి దక్షిణ ధృవంపైకి తొలిసారిగా ప్రయోగించిన చంద్రయాన్-3 మళ్లీ మేల్కొనలేదు. చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు 14 భూమి రోజులకు సమానమైన చంద్రుడి రోజున మేల్కొనలేదు. చంద్రయాన్ -3 ఒక చంద్రుడి రోజు లేదా 14 భూమి రోజులు మనుగడ సాగించేలా రూపొందించారు. ఆగస్టు 3న చంద్రయాన్3 చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో దిగింది.

చంద్రయాన్-3 ఏమైంది?

సెప్టెంబర్ 30న సూర్యకాంతి చంద్రుడి ఉపరితలం నుంచి తగ్గుముఖం పట్టింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శాస్త్రవేత్తలు చంద్రయాన్ -3 ల్యాండర్, రోవర్‌ను పునరుద్ధరించగలరని ఆశించారు. సెప్టెంబర్ 2న ప్రజ్ఞాన్ రోవర్, సెప్టెంబర్ 4న ల్యాండర్ ను ప్రయోగించారు. రోవర్ తన పనులను పూర్తి చేసుకుందని ఇస్రో తెలిపింది. ఇది సురక్షితంగా పార్క్ చేసి ఉంది. స్లీప్ మోడ్‌లో సెట్ చేసి ఉంది. ఏపీఎక్స్ఎస్, ఎల్ఐబీఎస్ పేలోడ్లు ఆఫ్ అయ్యాయి. ప్రస్తుతం బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయింది. ప్రజ్ఞాన్ బ్యాటరీలు పూర్తిగా ఛార్జ్ అయ్యాయని, రిసీవర్ ఆన్ లో ఉందని సమాచారం. చంద్రునిపై సూర్యోదయం కాగానే సూర్యరశ్మి అందేలా సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు.

ఇక శాశ్వత నిద్రలోకి..
అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా రోవర్, ల్యాండర్ మేల్కొనలేదు. చంద్రయాన్-3 నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. సెప్టెంబర్ 20న సూర్యుడు మళ్లీ చంద్రుడిపై ఉదయించాడు. మొదటి మూడు రోజులు - సెప్టెంబర్ 22 వరకు - విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ పునరుద్ధరించడానికి బెస్ట్ టైమ్. ల్యాండర్, రోవర్ మేల్కొనడానికి చివరి ఎర్త్ డే వరకు వేచి చూస్తామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. చంద్రుడి ఉపరితలంపై కొన్ని ప్రయోగాలను పునరావృతం చేయడానికి ఇది ఒక అవకాశం. కానీ విక్రమ్, ప్రజ్ఞాన్ స్పందించలేదు. ప్రజ్ఞాన్ రోవర్ బ్యాటరీలు చంద్రుడి విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల ప్రభావితమయ్యాయని అర్థమవుతోంది. గతంలో ఉన్న సమాచారం ప్రకారం చంద్రుడి ధ్రువాలు మైనస్ 180 డిగ్రీల సెల్సియస్ నుంచి మైనస్ 253 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతాయి. అంతేకాకుండా చంద్రుడిపై పూర్తిగా చీకటి పడటంతో చంద్రయాన్-3లోని సోలార్ ప్యానెల్స్ కూడా నిరుపయోగంగా మారాయి. రోవర్, ల్యాండర్లలో సాధారణంగా చంద్రుడిపైకి వెళ్లే హీటర్లు లేవని Space.com నివేదిక వెల్లడించింది.

చంద్రయాన్-3 ఎప్పటికీ జాబిల్లిపైనే ఉంటుందా?

చంద్రయాన్-3లోని ప్రజ్ఞాన్, విక్రమ్ ద్వయం మేల్కొనకపోతే, అది ఎప్పటికీ భారత లూనార్ అంబాసిడర్‌గా అక్కడే ఉంటుందని ఇస్రో ఇదివరకే తెలిపింది. విక్రమ్, ప్రజ్ఞాన్ భూమికి తిరిగి రావడానికి రూపొందించలేదు.

ALSO READ: సీట్లపై కాకి రెట్టలు.. ఫ్యాన్స్‌కి ఒళ్లు మండేలా చేసిన బీసీసీఐ.. ఫస్ట్ మ్యాచ్‌ తుస్సు!

CLICK HERE TO VIEW RTV WHATSAPP CHANNEL

#chandrayaan-3 #chandrayaan-3-mission
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe