చంద్రయాన్-3 లాంచింగ్ విజయవంతం.. ఇస్రో ఖాతాలో మరో మైలురాయి

చంద్రయాన్-3 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ బాహుబలి ప్రయోగాన్ని చేపట్టారు. 24రోజుల పాటు భూమి చుట్టూ ప్రదిక్షణ చేసిన అనంతరం జాబిల్లి కక్ష్యల్లోకి చేరనుంది.

New Update
చంద్రయాన్-3 లాంచింగ్ విజయవంతం.. ఇస్రో ఖాతాలో మరో మైలురాయి

నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3

చంద్రయాన్ సిరీస్ లో భాగంగా ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతంగా భూకక్ష్యలోకి ప్రవేశించింది. మూడు దశల్లో చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 25.30 గంటల పాటు కొనసాగిన కౌంట్ డౌన్ ముగియడంతో తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి సరిగ్గా 2గంటల 35 నిమిషాల 13 సెకన్లకు రెండో ప్రయోగవేదిక నుంచి ఎల్‌వీఎం-3 ఎం4 బాహుబలి రాకెట్ మంటలు విరజిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. అత్యంత శక్తిమంతమైన ఈ రాకెట్ ద్వారా ల్యాండర్, రోవర్, ప్రోపల్షన్ మాడ్యూల్‌తో ప్రయోగం చేపట్టారు. ఆగస్టు 24న చంద్రుడి కక్ష్యలో ల్యాండింగ్ కానుంది. ప్రధాని మోదీ ఫ్రాన్స్ దేశ పర్యటనలో ఉండడంటో ఈ ప్రయోగాన్ని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ దగ్గరుండి పర్యవేక్షించారు.

లాంచింగ్ విజయవంతంపై ప్రధాని మోదీ హర్షం

చంద్రయాన్-3 లాంచింగ్ విజయవంతంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథన్ తో పాటు ఇతర శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. భారతదేశ చరిత్రలో జులై 14 సువర్ణాక్షాలతో లిఖించదగ్గ రోజు అని తెలిపారు. తెలిపారు. మరోవైపు చంద్రయాన్-3ని విజయవతంగా భూకక్ష్యలోకి ప్రవేశపెట్టడంపై శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. భారతదేశం మొత్తం గర్వించేలా ఇస్రో చేసిందని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ కొనియాడారు. మొత్తానికి చంద్రయాన్-3 లాంచింగ్ సక్సెస్ కావడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

క్షిణ ధ్రువం రహస్యాలను తెలియజేయడమే దీని లక్ష్యం

భూమ్మీద నుంచి సుమారు 3,84,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి చంద్రుడి కక్ష్యలోకి చేరుకోనుంది. అనంతరం చంద్రగ్రహంపై ఉన్న దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో ల్యాండ్ అవ్వనుంది. చంద్రుడిని లోతుగా అధ్యయనం చేసి అక్కడ దాగున్న అనేక రహస్యాలను ప్రపంచానికి తెలియజేయడమే ఈ ప్రయోగం లక్ష్యంగా పెట్టుకుంది ఇస్రో. చంద్రయాన్-3 మొత్తం బరువు 3,920 కిలోలుగా ఉంది. అందులో ప్రొపల్షన్ మాడ్యూల్ 2,145 కిలోలు.. ల్యాండర్ 1,749 కిలోలు, రోవర్ 26కిలోలు ఉంటాయి. చంద్రయాన్- 2లో 14 పేలోడ్స్ పంపగా చంద్రయాన్-3 లో 5 ఇస్రో పేలోడ్స్, ఒకటి నాసా పేలోడ్ మాత్రమే ఉన్నాయి. ఇప్పటిదాకా అనేకదేశాలు చంద్రుడి ఉత్తర ధ్రువంపై పరిశోధనలు చేశాయి. ఇప్పుడు భారత్ మాత్రం చంద్రయాన్ సిరీస్ లో దక్షిణ ధ్రువం వైపే పరిశోధనలు చేస్తూ వస్తోంది. తాజాగా చంద్రయాన్-3 ల్యాండర్ ను కూడా దక్షిణ ధ్రువంలోని చిమ్మచీకటి ప్రాంతంలో ల్యాండ్ చేయనున్నారు. ఈ ప్రయోగం కోసం ఇస్రో రూ.610 కోట్లు ఖర్చుపెట్టింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు