Chandramukhi 2: ‘చంద్రముఖి 2’ సినిమా రిలీజ్‌ ఎప్పుడంటే..?

‘చంద్రముఖి 2’(chandramukhi 2) సెప్టెంబ‌ర్ 28న గ్రాండ్ గా రిలీజ్‌ కానుంది. రాఘవ లారెన్స్(raghava lawrence) హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్(kangana ranaut) న‌టించిన సినిమా ‘చంద్రముఖి 2’. లైకా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై సుభాస్కర‌న్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియ‌ర్ డైరెక్టర్ పి.వాసు రూపొందించారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల‌ కాబోతోంది.

New Update
Chandramukhi 2: ‘చంద్రముఖి 2’ సినిమా రిలీజ్‌ ఎప్పుడంటే..?

Chandramukhi 2: ‘చంద్రముఖి 2’ సెప్టెంబ‌ర్ 28న గ్రాండ్ గా రిలీజ్‌ కానుంది. రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ న‌టించిన సినిమా ‘చంద్రముఖి 2’. లైకా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై సుభాస్కర‌న్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియ‌ర్ డైరెక్టర్ పి.వాసు రూపొందించారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల‌ కాబోతోంది.

publive-image

సెప్టెంబర్ 24న ‘చంద్రముఖి 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌ జె.ఆర్.సి.కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. ఇక సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ మూవీని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ సంస్థ శ్రీ లక్ష్మి మూవీస్ వారు గ్రాండ్ లెవెల్లో విడుదల చేయనున్నారు. ఈ విషయమై కొద్దిసేపటి క్రితం మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేసారు. వడివేలు, రావు రమేష్, విగ్నేష్, రాధికా శరత్ కుమార్, లక్ష్మి మీనన్, రవిమరియా, సృష్టి డాంగే, వైజి మహేంద్రన్, మహిమా నంబియార్ తదితరులు ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు.

17 సంవత్సరాల క్రితం తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, నయనాతార, జ్యోతిక నటించిన 'చంద్రముఖి' ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఇన్నేళ్ల త‌ర్వాత వస్తున్న చంద్రముఖి 2 అభిమానులను అంతే  రితీలో అలరిస్తుందో లేదో  చూడాలి. ఓ వైపు హారర్, మరో వైపు కామెడీ ఎలిమెంట్స్‌తో చంద్రముఖి 2 అలరించనుందని ట్రైలర్‌లో స్పష్టమైంది. 'చంద్రముఖి'గా కంగనా రనౌత్ మెప్పించనుండగా.. ఓ వైపు స్టైలిష్ లుక్, మరోవైపు వేట్టయ రాజాగా రాఘవ లారెన్స్ అలరించబోతున్నారు.

Also Read: చంద్రబాబునే అరెస్ట్ చేస్తే మాలాంటి సామాన్యుడి పరిస్థితి ఏంటి..?

Advertisment
తాజా కథనాలు