గద్దర్ పోరాటం.. బాబు పోరాటం ఒక్కటేనా? ప్రజాగాయకుని సన్నిహితుల ఆగ్రహం

ప్రజాగాయకుడు గద్దర్ కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. అంతేకాదు గద్దర్ పోరాటం, నా పోరాటం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను గద్దర్ అభిమానులు, సన్నిహితులు తప్పుపడుతున్నారు.

New Update
గద్దర్ పోరాటం.. బాబు పోరాటం ఒక్కటేనా? ప్రజాగాయకుని సన్నిహితుల ఆగ్రహం

ప్రజాగాయకుడు గద్దర్ కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. అంతేకాదు గద్దర్ పోరాటం, నా పోరాటం అంటూ వ్యాఖ్యలు చేశాయి. దీనిని గద్దర్ అభిమానులు, సన్నిహితులు తప్పుపడుతున్నారు. అప్పట్లో గద్దర్ కాల్పుల వెనక చంద్రబాబు హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి. తెలంగాణలో బూటకపు ఎన్‌కౌంటర్లపై నిరసన వ్యక్తంచేస్తున్న గద్దర్ వల్ల ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలుగుతోందని.. అందుకే ఆయనను అంతమొందిచేందుకు ప్రయత్నించారని గద్దర్ సన్నిహితులు, ప్రధాన ప్రతిపక్షాలు అప్పట్లో ఆరోపించాయి. గద్దర్‌పై కాల్పుల ఘటనను మావోయిస్టులు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై అలిపిరిలో హత్యాయత్నం చోటుచేసుకుంది.

publive-image

క్లర్క్ ఉద్యోగానికి రాజీనామా..

1949లో మెదక్ జిల్లా తూప్రాన్‌లో జన్మించిన గద్దర్.. విద్యాభ్యాసం తర్వాత 1974లో బ్యాంకు క్లర్క్‌గా జీవితం ప్రారంభించారు. కొన్ని సంవత్సరాలు పాటు ఉద్యోగం చేసిన గద్దర్ ఆ తర్వాత నగ్జల్బరి, శ్రీకాకులం పోరాటాల ప్రేరణతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. తెలంగాణలో భూస్వాములకు వ్యతిరేకంగా 1984లో నక్సలిజంపై ఆకర్షితులై అడవిబాట పట్టారు. అయితే ఓ ఏడాది తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనంతరం ప్రజాజీవితంలోకి వచ్చిన గద్దర్ తన పాటలు, నాటికలు, బుర్ర కథలు, ఒగ్గు కథల ద్వారా పీడిత ప్రజలను చైతన్యపరిచారు. 1990ల్లో నిర్వహించిన జననాట్య మండలి సభకు రెండు లక్షల మంది ప్రజలు వచ్చారు. తన సాహిత్యంతో ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం కలవరపాటుకు గురైంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో బూటకపు ఎన్‌కౌంటర్లు తీవ్రంగా చోటుచేసుకున్నాయని గద్దర్ తీవ్ర నిరసన వ్యక్తంచేసేవారు. శవాలు మాట్లాడుతున్నాయని ప్రజలంతా తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చేవారు.

publive-image

1997లో గద్దర్‌పై కాల్పులు..

ఈ నేపథ్యంలో 1997 ఏప్రిల్ 6న గద్దర్‌ ఇంటి వద్ద ఆయనపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఐదు బుల్లెట్లు గద్దర్ శరీరంలోకి చొచ్చుకుపోయాయి. అందులో నాలుగు బుల్లెట్లను డాక్టర్లు బయటకు తీశారు కానీ.. వెన్ను దగ్గరలోని బుల్లెట్‌ని మాత్రం అలాగే ఉంచేశారు. అది తీస్తే గద్దర్‌ ప్రాణానికే ప్రమాదమని అలా వదిలేశారు. కానీ తన గళం ఉంటే చాలు ఇకే అవయవాలు పనిచేయకపోయినా ఏదైనా సాధించగలనని గద్దర్ భావించేవారు. చివరి క్షణం వరకు ప్రజాగాయకుడిగా తన గళంతోనే ప్రభుత్వాలపై పోరాటాలు చేశారు.

publive-image

గద్దర్‌ని కాల్చిందెవరు?

గద్దర్‌ని మానసికంగా హింసించింది చంద్రబాబు ప్రభుత్వమే అని ఆయన సన్నిహితులు యాదగిరి తెలిపారు. 26 సంవత్సరాలుగా లేని ఇప్పుడు చంద్రబాబు.. గద్దర్ ఇంటికి రావడం ఏంటని ప్రశ్నించారు. దీనిని ఓ వైపు హర్షిస్తున్నాం.. మరోవైపు ఖండిస్తున్నామని పేర్కొన్నారు. గద్దర్ ఇంటికి వచ్చిన చంద్రబాబు తనను క్షమించాల్సిందని చెబితే బాగుండేదన్నారు. గతంలో ఓ సందర్భంలో వేదికపై ఉన్న నాయకులందరితో పాటు చంద్రబాబును కూడా గద్దర్ ఆలింగనం చేసుకున్నారు. దీనిపై తామంతా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తంచేశామన్నారు.

publive-image

గద్దర్‌పై కాల్పులు జరిగిన తర్వాత వేట కొడవళ్లతో గద్దర్‌కి కాపలా ఉండేవాళ్లమన్నారు. ఆ సమయంలో గ్రీన్ టైగర్స్, కోబ్రాస్, నల్లమల్ల తాచులు పేర్లతో గద్దర్‌కు బెదిరింపులు వచ్చేవని చెప్పారు. గద్దర్ కుమారుడు డాక్టర్ చంద్రకిరణ్‌కు కూడా ఫోన్‌లో వార్నింగ్స్ వచ్చేవన్నారు. నయీమ్ ముఠా కూడా ఇంటి చుట్టూ వాహనాల్లో తిరిగే వారని చెప్పుకునేవారన్నారు. మూడు గంటలకు ఒకరి వంతున గద్దర్‌కి రక్షణగా నిలిచేవాళ్లమన్నారు. ఆపరేషన్ పూర్తి అయి ఆరోగ్యంగా తాను తిరిగి వస్తానని గద్దర్ ప్రజా పార్టీ ఏర్పాటుచేసి చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తామని మా అందరికి ధైర్యం చెప్పిన గద్దర్ తిరిగిరాని అనంతలోకాలకు వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఆరోపణలు ఖండించిన టీడీపీ..

గద్దర్ కాల్పుల ఘటనపై తెలంగాణ టీడీపీ నాయకురాలు జ్యోత్స్న స్పందించారు. సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాల్పులు ఘటన అనంతరం గద్దరన్నను బతికించుకోవడానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం శతవిథాలా ప్రయత్రించిందని ఆయన సన్నిహితులందరికి తెలుసని ఆమె క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు, గద్దర్ మధ్య మంచి అనుబంధం ఉందన్నారు. దీనిపై గద్దర్ అనేకసార్లు చెప్పారని గుర్తుచేశారు. అలాగే కాల్పుల ఘటన అనంతరం ఇద్దరు అనేక ఉద్యమాల్లో కలిసి పోరాటం చేశారని ఆమె తెలిపారు. గద్దర్ చూపించిన బాటలోనే టీడీపీ నడుస్తుందన్నారు. పంథాలు వేరు కావచ్చు కానీ ఇద్దరి గమ్యం ఒక్కటేనని జ్యోత్స్న వెల్లడించారు.

publive-image

publive-image

Advertisment
తాజా కథనాలు