TDP CHief Chandrababu: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ఏపీ సీఐడీ స్కిల్ డెవెలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో పలువురు చంద్రబాబు అభిమానులు తీవ్ర మనస్థాపానికి గురై మృతి చెందారు. అయితే బాధిత కుటుంబాలను చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర ద్వారా పరామర్శిస్తున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ.. ఆర్థిక సహాయం అందిస్తూ.. పార్టీ అన్నీ విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నారా భువనేశ్వరి ఉత్తరాంధ్రలో నిజం గెలవాలి యాత్ర చేపట్టారు.
Also Read: నరసాపురంలో తలనొప్పిగా మారిన టీడీపీ- జనసేన పొత్తు
అరకు నియోజకవర్గ ప్రాంతంలో పర్యటించి గిరిజనులు సాగు చేస్తున్న కాఫీని రుచి చూశారు. అయితే, ఇందుకు సంబంధించిన ఫొటోతో చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అరకు గోల్డ్ కాఫీ వద్ద కాఫీ తాగుతున్న భార్య భువనేశ్వరి ఫొటోను పోస్టు చేశారు. భువనేశ్వరీ.. మన గిరిజన సోదర సోదరీమణులు ఉత్పత్తి చేస్తున్న కాఫీ ఎలా ఉంది? అంటూ సరదాగా ప్రశ్నించారు.
అందుకు భార్య భువనేశ్వరి సోషల్ మీడియాలో స్పందిస్తూ.. అరకు కాఫీ అద్భుతంగా ఉందండీ.. దీన్ని ఎంతగానో ఇష్టపడుతున్నానని బదులిచ్చారు. మనింట్లో అరకు కాఫీ ప్యాకెట్లు చాలా ఉన్నప్పటికీ.. ఇక్కడి ప్రకృతి రమణీయత మధ్య, ఇక్కడి ప్రజల ఆదరాభిమానాల మధ్య అరకు కాఫీ రుచి మరింత బాగుందని కొనియాడారు. అంతేకాదు, అరకు కాఫీని అంతర్జాతీయ బ్రాండ్ గా మలచడంలో మీరు చేసిన కృషి పట్ల గర్విస్తున్నానని తెలిపారు.
Also Watch This Video: