AP CM Chandrababu: రేపు సీఎంగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే!

ఈ రోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎంగా తొలి సంతకం మెగా డీఎస్సీపై ఆయన చేయనున్నారు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేయనున్నారు.

AP Govt Jobs : ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. మరో 8,164 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం!
New Update

ఈ రోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ చాంబర్లో చంద్రబాబు బాధ్యతలను స్వీకరిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎంగా తొలి సంతకం మెగా డీఎస్సీపై ఆయన చేయనున్నారు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మూడో సంతకం వృద్ధాప్య పింఛన్లను రూ.4 వేలకు పెంపు, 4వ సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ఐదో సంతకం స్కిల్ సెన్సెస్ పై ఉండనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా రేపు చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ మీద చేయనున్నారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు మరో ప్రధాన హామీ ఇచ్చారు. దీంతో సీఎంగా రెండో సంతకం ఆ ఫైల్ పై పెట్టనున్నారు చంద్రబాబు. తాము అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని చంద్రబాబు ఎన్నికల సమయంలో మరో కీలక హామీ ఇచ్చారు. దీంతో ఆ హామీని సైతం నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే మూడో సంతకం ఆ ఫైల్ పై ఉండనుంది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. అయితే, ఆ తర్వాత వచ్చిన జగన్ సర్కార్ ఆ క్యాంటీన్లను తొలగించింది.

దీనిపై టీడీపీ నిరసనలు చేపట్టింది. తాము మళ్లీ అధికారంలోకి వస్తే తక్కువ ధరకే పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు చంద్రబాబు. ఆ హామీ మేరకు నాలుగో సంతకం అన్నా క్యాంటీన్లను ప్రారంభించే ఫైల్ పై పెట్టనున్నారు. ఇంకా ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన మరో ప్రధానమైన హామీ స్కిల్ సెన్సెస్. దీంతో ఆ ఫైల్ పై ఐదో సంతకం చేయనున్నారు చంద్రబాబు.

ఇదిలా ఉంటే.. ఈ రోజు సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలకు వెళ్లనున్నారు. రాత్రి 9 గంటలకు చంద్రబాబు తిరుమల చేరుకుంటారు. గాయత్రీ నిలయం అతిథి గృహంలో చంద్రబాబు బస చేస్తారు. రేపు ఉదయం 7.30 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటిదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. దీంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమరావతికి చేరుకుంటారు. సాయంత్రం ఆయన బాధ్యతల స్వీకరణ ఉంటుంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe