CBN vs Jagan: సమాధానం చెప్పి సభ పెడతావా.. సభలో సమాధానం చెబుతావా? : చంద్రబాబు!

జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని రాప్తాడు అడుగుతోందని జగన్‌ను ప్రశ్నించారు చంద్రబాబు. కియా అనుబంధ పరిశ్రమలు ఏమయ్యాయని? అనంత అడుగుతోందని.. డ్రిప్ పథకాలు గురించి సీమ రైతన్న అడుగుతున్నాడని జగన్‌ రాప్తాడు సభకు ముందు చంద్రబాబు ట్వీట్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది.

New Update
CBN vs Jagan: సమాధానం చెప్పి సభ పెడతావా.. సభలో సమాధానం చెబుతావా? : చంద్రబాబు!

Chandrababu Naidu Comments on Jagan: ఏపీలో రాజకీయ ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చంద్రబాబు, జగన్‌ ఒకరిపైఒకరు తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. కాసేపట్లో రాప్తాడు సభలో జగన్‌ ప్రసంగించనుండగా.. మీటింగ్‌ స్టార్ట్‌కు ముందే మాటల మంటలు మొదలయ్యాయి. సోషల్‌మీడియా వేదికగా జగన్‌పై చంద్రబాబు మరోసారి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని రాప్తాడు అడుగుతోందని ప్రశ్నించారు. 'అనంత అడుగుతోంది కియా అనుబంధ పరిశ్రమలు ఏమయ్యాయని?' అంటూ ట్వీట్ చేశారు. సీమ రైతన్న అడుగుతున్నాడు నాటి డ్రిప్ పథకాలు ఎక్కడని అంటూ నిలదీశారు చంద్రబాబు. సమాధానం చెప్పి సభ పెడతావా.... సభలో సమాధానం చెపుతావా అని ట్వీట్ చేశారు.


జగన్ ఏం ప్రకటిస్తారో?
మరోవైపు రాప్తాడు సభలో జగన్‌ మేనిఫెస్టోను ప్రకటిస్తాని తెలుస్తోంది. జగన్‌ ప్రకటించే వరాలపై ఉత్కంఠ నెలకొంది. సంక్షేమ పథకాలనే వైసీపీ నమ్ముకుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకు మించి హామీలు ఇచ్చే ఛాన్స్‌ కనిపిస్తోంది. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టో ఉండనుంది. మహిళలు, రైతులు, యువతను ఆకట్టుకునే విధంగా హామీలు ఉండనున్నాయి. డ్వాక్రా రుణాలపై వడ్డీ మాఫీ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. రైతు రుణ మాఫీ లాంటి హామీలు ఇచ్చే అవకాశం ఉంది. వృద్ధులను ఆకర్షించేలా ఫించను దశలవారీ రూ.4వేలకు పెంచే ఛాన్స్‌ ఉంది.

ఇక బీసీలు టార్గెట్‌గా మరిన్ని హామీలు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. బీసీ, కాపు మహిళలకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని పెంచే అవకాశం ఉంది. వైఎస్సార్‌ చేయూత సాయం కింద రూ.18,750 నుంచి రూ.25వేలకు పెంచుతురాని టాక్. అమ్మఒడి సాయాన్ని ఇద్దరు పిల్లల వరకు పెంచుతారని తెలుస్తోంది.

Also Read: కోటాలో మరో విద్యార్థి అదృశ్యం.. వారంలో రెండో ఘటన

Advertisment
Advertisment
తాజా కథనాలు