రేపు ఉదయం 11.27 గంటలకు గన్నవరం ఐటీ పార్క్ సమీపంలోని కేసరపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి దాదాపు 20 మందికిపైగా VVIPలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. వీరితో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, మేఘాలయ సీఎం హాజరుకానున్నారు.
Chandrababu swearing-in ceremony: రేపే చంద్రబాబు ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న 20 మంది VVIPల లిస్ట్ ఇదే!
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మరో 20 మంది వీవీఐపీలు హాజరుకానున్నారు. మహారాష్ట్ర, యూపీ, ఎంపీ, మేఘాలయల సీఎంలతో పాటు జేపీ నడ్డా తదితర కేంద్ర మంత్రులు వస్తున్నారు. ఇంకా రజినీకాంత్, చిరంజీవి ఫ్యామిలీలు సైతం హాజరుకానున్నాయి.
Translate this News: