/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Chandrababu-Swearing-Ceremony.jpg)
Chandrababu Swearing Ceremony:ఈరోజు విజయవాడలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రాణాస్వీకారం చేయనున్న సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా సెలవు ప్రకటించారు. కాగా వేసవి సెలవుల అనంతరం రేపటి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. వాస్తవానికి ఈరోజు నుంచి స్కూళ్ళు తెరవాల్సి ఉండగా ఉద్యోగ సంఘాల రిక్వెస్ట్ వల్ల సెలవును ఒక రోజుకు పొడిగిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు తెలంగాణలో ఈరోజు నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరుచుకున్నాయి. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ, అమిత్ షా, రాజకీయ, సినీ ప్రముఖులు ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు.
చంద్రబాబుతో సహా 24 మంది ప్రమాణస్వీకారం..
- నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి)
- కొణిదెల పవన్ కళ్యాణ్
- కింజరాపు అచ్చెన్నాయుడు
- కొల్లు రవీంద్ర
- నాదెండ్ల మనోహర్
- పి.నారాయణ
- వంగలపూడి అనిత
- సత్యకుమార్ యాదవ్
- నిమ్మల రామానాయుడు
- ఎన్.ఎమ్.డి.ఫరూక్
- ఆనం రామనారాయణరెడ్డి
- పయ్యావుల కేశవ్
- అనగాని సత్యప్రసాద్
- కొలుసు పార్థసారధి
- డోలా బాలవీరాంజనేయస్వామి
- గొట్టిపాటి రవి
- కందుల దుర్గేష్
- గుమ్మడి సంధ్యారాణి
- బీసీ జనార్థన్ రెడ్డి
- టీజీ భరత్
- ఎస్.సవిత
- వాసంశెట్టి సుభాష్
- కొండపల్లి శ్రీనివాస్
- మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
- నారా లోకేష్