/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/files.jpg)
Chandrababu: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాద ఘటనపై ప్రభుత్వం అత్యవసర విచారణ చేపట్టింది. కీలక ఫైల్స్ అగ్నిప్రమాదంలో దగ్గం అయ్యాయని సమాచారం. నూతన సబ్ కలెకర్ట్ బాధ్యతలు చేపట్టడానికి గంటల ముందే ఈ ఘటన జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఘటనను అంత్యంత సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. అగ్నిప్రమాదమా, కుట్ర పూరితమా అనే అంశంలో విచారణ చేయాలని అధికారులను ఆదేశించింది. ఉద్దేశ్య పూర్వకంగా భూములకు సంబంధించి కీలక ఫైల్స్ దగ్ధం చేశారనే ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు.. వెంటనే ఘటనా స్థలానికి హెలికాఫ్టర్ లో వెళ్లాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీజీపీ, సిఐడీ చీఫ్ కొద్ది సేపట్లో మదనపల్లి బయలుదేరనున్నారు.
Also Read: అసలు నీ భర్త ఎవరు?: శాంతికి సర్కార్ నోటీసులు